Share News

పెరిగిన పత్తి ధర

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:24 AM

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ పత్తి ధర రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం పత్తి ధర క్వింటాలు గరిష్ఠం రూ. 7,699 పలికింది.

పెరిగిన పత్తి ధర
విక్రయానికి వచ్చిన పత్తి దిగుబడి

క్వింటం గరిష్ఠంగా రూ. 7,699

ఆదోని అగ్రికల్చర్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ పత్తి ధర రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం పత్తి ధర క్వింటాలు గరిష్ఠం రూ. 7,699 పలికింది. వారం రోజుల్లో క్వింటానికి రూ.400పైగా ధర పెరిగింది. ఆర్థిక సంవత్సరం ముగిస్తుండడంతో పత్తి ధరల్లో కదలికలు వచ్చాయి. గత నెల రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు మళ్లీ పెరుగుతుండడంతో పత్తి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దూది బేళ్లు ఎగుమతులు పెరగడంతో, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరుల పెరగడం స్థానిక మార్కెట్‌ యార్డ్‌లో పత్తి ధరలు పెరగడానికి కారణమైందని వ్యాపారులు చెబుతున్నారు. 664 క్వింటాళ్లు పత్తి విక్రయానికిరాగా వాటి కనిష్ఠ ధర రూ.5,089, గరిష్ఠ ధర రూ. 7699, మధ్యస్థ ధర 7,379 పలికింది.

Updated Date - Mar 21 , 2025 | 12:24 AM