Share News

ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడండి

ABN , Publish Date - Mar 24 , 2025 | 11:18 PM

పోలీస్‌ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు ఎలాటి పరిస్థితుల్లో పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత పోలీస్‌ అధికారులకు ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా అన్నారు.

ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడండి
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా

పోలీస్‌ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ

నంద్యాల క్రైం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు ఎలాటి పరిస్థితుల్లో పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత పోలీస్‌ అధికారులకు ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా అన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్‌ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా పాల్గొన్నారు. ప్రజల నుంచి 62 వినతులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించి చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. కుటుంబ కలహాలు, సివిల్‌ తగాదాలు, అత్తారింటి వేధింపులు తదితరాలపై ప్రజలు ఎస్పీకి విన్నవించుకున్నారు. కార్యక్రమంలో ఎస్పీతోపాటు నంద్యాల సబ్‌ డివిజన్‌ ఏఎస్పీ మంద జావళి ఆల్ఫోన్స్‌, అడిషనల్‌ ఎస్పీ ఎన్‌.యుగంధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 11:18 PM