Share News

మీటర్‌ రీడర్లకు ఉపాధి చూపాలి

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:57 AM

విద్యుతశాఖలో పనిచేస్తున్న మీటర్‌ రీడర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునెప్ప డిమాండ్‌ చేశారు.

మీటర్‌ రీడర్లకు ఉపాధి చూపాలి
ధర్నా నిర్వహిస్తున్న ఏఐటీయూసీ నాయకులు

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునెప్ప

కల్లూరు, మార్చి 20(ఆంధ్రజ్యోతి): విద్యుతశాఖలో పనిచేస్తున్న మీటర్‌ రీడర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునెప్ప డిమాండ్‌ చేశారు. విద్యుత మీటర్‌ రీడర్స్‌ యూని యన, ఏఐటీయూసీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు జి.రాజు అధ్యక్షతన కర్నూలు విద్యుత శాఖ ఎస్‌ఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిం చారు. ఈసందర్భంగా మునెప్ప మాట్లాడుతూ 20 ఏళ్లుగా విద్యుతశాఖలో మీటర్‌ రీడర్లుగా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్‌మీటర్ల వల్ల ఉపాధి కోల్పోతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు నెలల క్రితం ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ మీటర్‌ రీడర్లకు ఎస్రో అకౌంట్‌ ద్వారా వేతనాలు చెల్లించాలని జీఓ ఇచ్చినప్పటికీ అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు పీస్‌ రేట్ల ప్రకారం బిల్లుల డబ్బులు చెల్లించని కాంట్రా క్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయ కులు హమీద్‌, నరసింహా రెడ్డి, వీరేష్‌, వేదవసముని పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 12:57 AM