రాములోరి కల్యాణోత్సవానికి నంద్యాల తలంబ్రాలు
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:07 AM
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీరాముల వారి కల్యాణోత్సవానికి తలంబ్రాలు సిద్ధమయ్యాయి. ప్రతి ఏటా ప్రభుత్వం ఘనంగా నిర్వహించే ఒంటిమిట్ట రాములోరి కల్యాణోత్సవానికి నంద్యాల జిల్లా నుంచి ప్రత్యేకంగా తలబ్రాలు సిద్ధమవుతాయి.

ఒంటిమిట్టకు తరలించిన భక్తులు
నంద్యాల కల్చరల్, మార్చి 31(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీరాముల వారి కల్యాణోత్సవానికి తలంబ్రాలు సిద్ధమయ్యాయి. ప్రతి ఏటా ప్రభుత్వం ఘనంగా నిర్వహించే ఒంటిమిట్ట రాములోరి కల్యాణోత్సవానికి నంద్యాల జిల్లా నుంచి ప్రత్యేకంగా తలబ్రాలు సిద్ధమవుతాయి. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో వడ్లను గోటితో వలిచిన తలంబ్రాల బియ్యం కోసం సోమవారం పూజలు చేశారు. అనంతరం తలంబ్రాల బియ్యంను కోదండరామస్వామి ఆలయంలో పూజ చేయించి ‘మన ఊరు-మన గుడి’ మన బాధ్యత నిర్వాహకులు ఒంటిమిట్ట రామాలయానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో గురురాఘవేంద్ర విద్యాసంస్ధల చైర్మన్ దస్తగిరి రెడ్డి, భగవత్ సేవాసమాజ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.