Share News

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:45 PM

ప్రకృతి వ్యవసాయం లాభదాయకమని ఏపీఎం చక్రదర్‌ సూచించారు. శుక్రవారం వెలుగు కార్యాలయంలో వ్యవసాయ, వెలుగు డీఆర్‌డీఏ శాఖలతో ఖరీఫ్‌ కార్యచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం
దేవనకొండలో అవగాహన కల్పిస్తున్న అధికారులు

పత్తికొండ టౌన్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయం లాభదాయకమని ఏపీఎం చక్రదర్‌ సూచించారు. శుక్రవారం వెలుగు కార్యాలయంలో వ్యవసాయ, వెలుగు డీఆర్‌డీఏ శాఖలతో ఖరీఫ్‌ కార్యచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. మండలంలో అధిక శాతంలో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఏఈవోలు శ్రీనాథ్‌, సర్వేశ్వరుడు, ప్రకృతివ్యవసాయ యూనిట్‌ ఇన్‌చార్జి మల్లికార్జున పాల్గొన్నారు.

దేవనకొండ: ప్రకృతి వ్యవసాయంతోనే రైతులు అధిక ఆదాయం పొందవచ్చని వెలుగు ఏపీఎం నర్సన్న, మండల సమాఖ్య అధ్యక్షురాలు వెంకటలక్ష్మి అన్నారు. శుక్రవారం వెలుగు కార్యాలయంలో ప్రజా భాగ్యస్వామ్య ప్రకృతి వ్యవసాయం పై వివోఏ, వివోవోబీలకు శిక్షణ ఇచ్చారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రీయ పద్దతుల్లో వ్యవసాయం యుమాలరారకె, .సీసీ మస్తాన్‌, ముద్దురంగడు, స్వామన్న, ప్రభాకర్‌, విష్ణు, ఏసీ శివ పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:45 PM