Share News

వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

ABN , Publish Date - Mar 18 , 2025 | 12:41 AM

రోజురోజుకు పెరుగు తున్న ఎండలు దృశ్య ప్రజలు వడదెబ్బ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా సంచార చికిత్స నోడల్‌ అధికారి రఘు సూచిం చారు.

వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
చిలకలడోణలో గ్రామస్థులతో మాట్లాడుతున్న జిల్లా సంచార చికిత్స ఆధికారి రఘు

మంత్రాలయం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకు పెరుగు తున్న ఎండలు దృశ్య ప్రజలు వడదెబ్బ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా సంచార చికిత్స నోడల్‌ అధికారి రఘు సూచిం చారు. సోమవారం కల్లుదేవకుంట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం చిలకలడోణ గ్రామంలో మండల వైద్యాఽ దికారి గోవిందమ్మ ఆధ్వర్యంలో అసంక్రమిత వ్యాధుల సర్వేను పరిశీ లించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రత వల్ల అలసట, నోరు ఎండిపోవడం, తలకొప్పి, వాంతులు, జ్వరం, వళ్ళునొప్పు లు వంటి లక్షణాలు కనిపిస్తే స్థానిక ఆస్పత్రికి తరలించాలని తెలిపారు. అవసరమైతే బయటకు వెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో పీహెచవో వంకటలక్ష్మి, సూపర్‌వైజర్‌ భారతి, తులసి, ఖలీల్‌ పాల్గొన్నారు.

గోనెగండ్ల: మహిళలు క్యాన్సర్‌ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని, అవగాహన కల్పించడం ఆరోగ్యశాఖ అధికారులు, ఆరోగ్య కార్యకర్తల బాధ్యత అని జిల్లా సంచార చికిత్స నోడల్‌ అధికారి రఘు అన్నారు. సోమవారం గోనెగండ్లలోని ఆరోగ్యకేంద్రంలో సామాజిక ఆరోగ్య కార్యక ర్తలకు, మహిళా ఆరోగ్య కార్యకర్తలకు ఎనసీడీ, సీడీ వ్యాధుల స్ర్కీనింగ్‌ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ అసంక్రమిత వ్యాధులైన రోమ్ముక్యాన్సర్‌, నోటి క్యాన్సర్‌, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ బారిన మహిళలు ఎక్కువగా పడుతు న్నారని, దానిని గుర్తించేందుకు ప్రభుత్వం క్యాన్సర్‌ సర్వేలు చేపట్టిం దని తెలిపారు. ఆరోగ్యసిబ్బంది ప్రతి రోజు గ్రామాలలో సర్వేలు నిర్వ హించాలన్నారు. నోటిలో ఎర్ర, తెల్ల మచ్చలలో పుండ్ల్లు ఉంటే వెంటనే పరీక్షలు చేయించాలన్నారు. సమావేశంలో వైద్యులు రంగారవళి, రుక్సానా, క్షేత్రస్థాయి పర్యవేక్షకులు మేరీ గోల్డ్‌, భారతి, హనుమంతు, సుధాకర్‌, శాంతమ్మ, కృష్ణ, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 12:41 AM