Share News

సన్మార్గం చూపే రంజాన్‌

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:23 AM

దైవిక భావనలతో, ధార్మిక చిం తనలతో గడుపుతూ... 30 రోజుల పాటు రోజా ఉప వాస దీక్షలు, నిత్యం నమాజుల తర్వాత సోమవారం ‘ఈద్‌- ఉల్‌-ఫితర్‌’ (రంజాన్‌) పండుగ ను జిల్లా ప్రజలు నిర్వహించుకోనున్నారు.

సన్మార్గం చూపే రంజాన్‌

ముగిసిన రోజా ఉపవాస దీక్షలు

నేడు ‘ఈద్‌-ఉల్‌-ఫితర్‌

కర్నూలు కల్చరల్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): దైవిక భావనలతో, ధార్మిక చిం తనలతో గడుపుతూ... 30 రోజుల పాటు రోజా ఉప వాస దీక్షలు, నిత్యం నమాజుల తర్వాత సోమవారం ‘ఈద్‌- ఉల్‌-ఫితర్‌’ (రంజాన్‌) పండుగ ను జిల్లా ప్రజలు నిర్వహించుకోనున్నారు. ఆదివారం సాయంత్రం ఇఫ్తార్‌ సమయంలో ఉపవాస దీక్షలను ముగించారు. అనంతరం నెలవంక దర్శనంతో ఆనందోత్సా హాల మధ్య ‘ఈద్‌-ఉల్‌-ఫితర్‌’ (రంజాన్‌) వేడుకలు జరుపుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఉమ్మడి జిల్లాలో రంజాన్‌ రోజున ఉదయం ఆయా ప్రాంతాల్లోని ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం ఆనవాయితీ. కాగా జిల్లాలోని ఈద్గాలను శుభ్రం చేసి, షామియానాలు, మంచినీటి వసతి కల్పించారు. నందాల, ఆదోని, ఎమ్మి గనూరు, డోన్‌, పత్తికొండ, నందికొట్కూరు, ఆత్మకూరు, బనగానపల్లె తదితర పట్టణాల్లో రంజాన్‌ ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు.

Updated Date - Mar 31 , 2025 | 12:24 AM