Share News

భక్తిశ్రద్ధలతో రంజాన్‌

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:54 PM

పట్టణంలో ముస్లింలు సోమవారం రంజాన్‌ను భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. నెలరోజులు ఉపవాసాలు చేసి, పట్టణంలోని పురాతనమైన చారిత్రాత్మక జామియా మసీదులో నమాజ్‌ చేశారు.

భక్తిశ్రద్ధలతో రంజాన్‌
ఆదోని జామియా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నభక్తులు

నియోజకవర్గాల్లో వేడుకలు

మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు

శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

ఆదోని/అగ్రికల్చర్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ముస్లింలు సోమవారం రంజాన్‌ను భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. నెలరోజులు ఉపవాసాలు చేసి, పట్టణంలోని పురాతనమైన చారిత్రాత్మక జామియా మసీదులో నమాజ్‌ చేశారు. ఉదయం నుంచే మసీదులు, దర్గాల వద్దకు ముస్లింలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇమాంలు వారితో ఖరాన్‌ చదివి వినిపించారు. ఒకరికొరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఎమ్మెల్యే పార్థసా రథి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, టీడీపీ నాయకుడు ఉమాపతి నాయుడు, కురువ కార్పొరే షన్‌ చైర్మన్‌ దేవేంద్రప్ప శుభాకాంక్షలు తెలిపారు.

ఆదోని రూరల్‌: మండలంలోని పెద్దపెండేకల్లు, పెద్దతుంబళం, ఇస్వీ, పెద్దహరివాణం, తదితర గ్రామాల్లో ముస్లింలు రంజాన్‌ వేడుకలను చేసుకున్నారు. మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఒకరికొకరు శుభాకాంక్షలు లుపుకున్నారు.

పేదరిక నిర్మూలనే నిజమైన రంజాన్‌

హొళగుంద: పేదరిక నిర్మూలనే నిజమైన రంజాన్‌ అని మౌలాన హబీబుల్లా జామయి సోమవారం అన్నారు. హొళగుందలోని మసీదుల్లో ముస్లింలు నమాజ్‌ చేశారు. డీఎస్పీ వెంకట్రామయ్య, సీఐ రవిశంకర్‌ రెడ్డి, ఎస్సై దిలీప్‌కుమార్‌ బందోబస్తు నిర్వహించారు. గజ్జహల్లి, వందవాగాలి, ఇంగళదహాల్‌,. ఎల్లార్తి, హెబ్బటం, ఎండీ హల్లి, సులువాయి, నేరణికి తండాలో వేడుకలు చేశారు.

ఘనంగా రంజాన్‌ వేడుకలు

ఆలూరు: మండలంలో ముస్లింలు రంజాన్‌ను సంతోషంగా నిర్వహించారు. మతపెద్దలు రంజాన్‌ విశిష్టతను తెలియజేశారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

దేవనకొండ: మండలలంలో ముస్లింలు రంజాన్‌ పండుగను భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. నెలవంక దర్శనంతో ఉపవాస దీక్షలు ఆదవారంతో ముగి శాయి. సోమవారం ఉదయం ఈద్గా వద్దకు చేరుకొని, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మతపెద్దలు పండుగ విశిష్టత తెలిపి, సమాజంలో శాంతిని నెలకొల్పాలని సూచించారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

మద్దికెర: మండలంలోని మద్దికెర, ఎం.అగ్రహారం, పెరవలి గ్రామాల్లో ముస్లింలు రంజాన్‌ను నిర్వహించారు. ఉదయాన్నే మసీదులో నమాజ్‌ అనంతరం ఈద్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

పత్తికొండ టౌన్‌: పట్టణంలో సోమవారం రంజాన్‌ వేడుకలను ముస్లింలు నిర్వహించారు. నెల రోజులు ఉపవాసదీక్ష చేసి, సోమవారం రంజాన్‌ సందర్భ ంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ శుభాకాంక్షలు తెలిపారు

నల్లబ్యాడ్జిలతో ముస్లింల నిరసన

పత్తికొండ టౌన్‌: వక్ఫ్‌బోర్డు చట్టసవరణ బిల్లుకు వ్యతిరేకంగా సోమవారం పత్తికొండలో ముస్లింలు నల్లబ్యాడ్జిలు ధరించారు. ముస్లింల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి సాబుద్దీన్‌, నూర్‌ బాషా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నూర్‌బాషా, ముస్లిం మతపెద్దలు మాట్లాడుతూ మైనార్టీలకు ముప్పుగా భావించే వక్ఫ్‌బోర్డు సవరణను కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలించి తక్షణమే ఉపంహ రించుకోవాలని డిమాండ్‌ చేశారు. హజీ షేక్షావలి, మహూబూబ్‌ బాషా, హుశేన్‌షా, రహంతుల్లా పాల్గొన్నారు.

తుగ్గలి: మండలంలోని రాంపురం కొట్టాల, హుశేనాపురం, జొన్నగిరి, తుగ్గలి గ్రామాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకు న్నారు. అనంతరం పేదలకు సాయం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు కమల్‌, మస్తాన్‌బీలు, సుల్తాన్‌, హుశేన్‌, తదితరులు ఉన్నారు.

హాలహర్వి: ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు రంజాన్‌ విశిష్టతను తెలియజేశారు. ప్రార్థనలు అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Updated Date - Mar 31 , 2025 | 11:54 PM