Share News

అవినీతి నిరూపిస్తే రాజీనామా

ABN , Publish Date - Mar 20 , 2025 | 11:56 PM

అవినీతి చేయలేదని, చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని వైసీపీ నాయకు రాలు, కర్నూలు జిల్లాలోని ఆదోని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వాల్మీకి శాంత అన్నారు. ఆదోనిలోని కోట్ల సర్కిల్‌లో గురువారం ‘జగనన్నా.. న్యాయం చెప్పన్నా’ అంటూ నిరసన దీక్ష చేపట్టారు.

అవినీతి నిరూపిస్తే రాజీనామా
మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శాంత దీక్ష

ఆదోని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శాంత దీక్ష

ఆదోని టౌన్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): అవినీతి చేయలేదని, చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని వైసీపీ నాయకు రాలు, కర్నూలు జిల్లాలోని ఆదోని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వాల్మీకి శాంత అన్నారు. ఆదోనిలోని కోట్ల సర్కిల్‌లో గురువారం ‘జగనన్నా.. న్యాయం చెప్పన్నా’ అంటూ నిరసన దీక్ష చేపట్టారు. శాంత మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల అనంతరం చైర్‌ పర్సన్‌ పోస్టుకు రూ.కోట్లలో బేరం జరుగుతున్నా అవినీతి మచ్చలేని తన పేరును జగనన్న ఎంపిక చేశారన్నారు. అక్రమ బిల్లులను మంజూరు కాకుండా అడ్డుకున్నందుకే తనను పదవి నుంచి దించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ జిల్లా అధ్యక్షడు ఎస్వీ మోహన్‌ రెడ్డి కూడా తన వివరణ తీసుకోకుండానే తమ పార్టీకి చెందిన అసమ్మతి కౌన్సిలర్లతో కలెక్టర్‌ను కలిసి అవిశ్వాస తీర్మానం కోరడం అర్థరహితమన్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడం కోసం ఓ కౌన్సిలర్‌ మిగతా కౌన్సిలర్లకు ముందస్తుగా రూ.50 వేలు పంపిణీ చేశారని, తనను ఒడిస్తే మరో రూ.లక్ష ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఓ వైస్‌ చైర్మన్‌కు రూ.5 లక్షలు, ఓ మాజీ ప్రజాప్రతినిధికి పెద్ద మొత్తం అందజే యడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. అవిశ్వాసంపై జగనన్నకు ఫిర్యాదు చేశానని, సమాధానం కోసం ఎదురు చూస్తున్నానని ఆమె చెప్పారు.

Updated Date - Mar 20 , 2025 | 11:56 PM