తూతూ మంత్రంగా సామాజిక తనిఖీ
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:02 AM
మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సామాజిక తనిఖీ సమావేశంలో తూతూ మంత్రంగా సాగింది.

రూ.76.92 కోట్లతో ఉపాధి పనులు
రికవరీ రూ. 4,28,021
నందవరం, మార్చి 28(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సామాజిక తనిఖీ సమావేశంలో తూతూ మంత్రంగా సాగింది. సమావేశానికి కూలీలు, ప్రజల నుంచి స్పందన కరువైంది. కేవలం అధికారులు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. డ్వామా పీడీ వెంకటరమణయ్య మాట్లాడుతూ 2023-2024 ఉపాధి పనులకు గాను 684 పనులను గుర్తించి అందుకు గాను రూ. 76.92 కోట్లను విడుదల చేశామన్నారు. అయితే అందులో పీఆర్ పనులకు గాను రూ. 4.47 కోట్లు కేటాయించామని తెలిపారు. ఈ నిధులతో 34 పనులు చేపట్టారు. పనులకు సంబంధించి రూ. 4,28,021 పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ఈ సొమ్మును వెంటనే రికవరీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఉపాధిహామీ అడిషనల్ పీడీ మాధవీలత, డీవీవో లోకేశ్వరి, ఏపీడీ అల్లిపీర, ఎంపీడీవో పుల్లయ్య, ఏపీఓ శ్రీనివాసులు, ఈసీ నూర్జహాన, సిబ్బంది పాల్గొన్నారు.
మంత్రాలయం: మంత్రాలయం మండలంలో 2023-2024 ఏడాది ఉపాధి హామీ పనుల్లో రూ. 2.07 లక్షలు అవినీతి జరిగినట్లు డ్వామా పీడీ వెంకటరమణయ్య తెల్చారు. డీఆర్‌పీలు ఐదు రోజుల క్రితం గ్రామాల్లో తిరిగి చేసిన పనులను సర్వే చేశారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో 18వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక సోషల్ ఆడిట్‌పై ఎంపీడీవో రాధ, ఏపీవో తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో 20 గ్రామ పంచాయతీల్లో 1217 పనుల్లో 11.17 కోట్లతో పనులు పూర్తి చేశామని తెలిపారు. ఇందులో ఎనఆర్‌ఈజీఎ్‌స, పంచాయతీరాజ్, గృహ నిర్మాణం, ఎస్‌ఎ్‌సఏ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో అత్యధికంగా మంత్రాలయంలో రూ.97,625, వి.తిమ్మాపురంలో రూ. 28,996లు, చిల కలడోనలో రూ.11,344లు, పరమానదొడ్డి తండాలో రూ. 18,577లు గుర్తి ంచారు. మిగతా గ్రామాల్లో వేలల్లో, వందల్లో అవినీతి జరిగినట్లు గుర్తించారు. రైతులకు రూ. 33వేల ఫెనాల్టీ విధించారు. అవినీతికి పాల్పడిన సొమ్మును రికవరీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ పీడీ మాధవీలత, డీవోవీవీ లోకేశ్వర్, పంచాయతీరాజ్ నంద వరం, మంత్రాలయం ఏఈలు నరసింహులు, మల్లయ్య, ఈసీ శ్రీనివా సులు, డీఆర్‌పీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ కార్యద ర్శులు పాల్గొన్నారు.