ముగిసిన సుయతీంద్రతీర్థుల ఆరాధనోత్సవాలు
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:56 AM
రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సుయతీంద్రతీర్థుల 12వ ఆరాధనోత్సవాలు గురువారం ఘనంగా ముగిసాయి.

మంత్రాలయం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సుయతీంద్రతీర్థుల 12వ ఆరాధనోత్సవాలు గురువారం ఘనంగా ముగిసాయి. మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో తన గురువైన సుయతీంధ్రతీర్థుల మూల బృంధావనానికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించి తులసి అర్చన చేసి బంగారు, వెండి, పట్టువస్త్రాలు, గులాబి పుష్పాలతో అలంకరించి మహా మంగళహారతులు ఇచ్చారు. యాగశాలలో నిర్వహించిన ప్రవచనాలు, దాసవాని సాహిత్యం భక్తులను ఆకట్టుకున్నాయి. పూర్ణబోధ పూజామందిరంలో మూలరాములకు కనకాభిషేకం చేసి రాఘవేంద్రస్వామి బంగారు పాదుకలకు పూజలు, పుష్పాలతో అభిషేకం చేసి హారతులు ఇచ్చారు. కార్యక్రమంలో పండితకేసరి రాజా ఎస్ గిరిరాజాచార్, ఎస్‌ఎన వెంకటేశాచార్, ఎస్‌ఎన రఘునందన ఆచార్, సుజీంధ్రాచార్, గౌతమాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు వెంకటేశ జోసీ, శ్రీపతాచార్, సురేష్ కోనాపూర్, ఐపీ నరసింహమూర్తి, అనంతపురాణిక్, కర్నూలు జేఈవో పాండురంగారెడ్డి, డీఎం ఆనందరావు, జేసీ స్వామి, వాధీంధ్రాచార్,, వ్యాసరాజాచార్, వాధిరాజాచార్ పాల్గొన్నారు.
అలరించిన దాసవాని సాహిత్యం: ఉత్సవాల ముగింపులో భాగంగా బెంగళూరు చెందిన విద్వాన శ్రీనిధిఆచార్‌చే నిర్వహించిన దాసవాని సాహిత్యం భక్తులను ఆకట్టుకుంది. బెంగళూరు చెందిన విద్వాన బ్రాహ్మణాచార్, ఉత్తనూరు చెందిన శ్రీనిధి ఆచార్‌చే ప్రవచనాలు భక్తులను అలరించాయి. వీరికి పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు శేషవస్త్రం, నగ దు, ఫలపుష్ప మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు.