బండి నడపాలంటే పరీక్ష
ABN , Publish Date - Mar 20 , 2025 | 11:48 PM
పట్టణ జనాభా రోజురోజుకు పెరుగుతోంది. అయితే అందుకు తగ్గట్లు రహదారులను విస్తరించలేదు. 30 ఏళ్ల క్రితం ఉన్న రోడ్లే నేటికీ ఉన్నాయి.

ఆదోనిలో పెరుగున్న ట్రాఫిక్ కష్టాలు
రోడ్డుపైన వాహనాల పార్కింగ్, కళ్లు మూసుకున్న ట్రాఫిక్ పోలీసులు
ఆదోని, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): పట్టణ జనాభా రోజురోజుకు పెరుగుతోంది. అయితే అందుకు తగ్గట్లు రహదారులను విస్తరించలేదు. 30 ఏళ్ల క్రితం ఉన్న రోడ్లే నేటికీ ఉన్నాయి.
విద్యార్థులకు పరీక్ష
ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. అయితే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలంటే ఒక పరీక్షగా మారింది. పట్టణంలోని ప్రధాన రహదారి మున్సిపల్ మెయిన్ రోడ్డులో రోడ్డులపైనే వాహనాలు పార్కింగ్ చేస్తుండటంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీ హోటళ్ల వద్ద రోడ్డుపైనే ద్విచక్ర వాహనాలను నిలిపేస్తున్నారు. కళ్లెదుటే కనిపిస్తున్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.