మధ్యవర్తిత్వంపై ముగిసిన శిక్షణ
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:53 PM
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీ నుంచి శుక్రవారం వరకు మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణ కార్యక్రమం ముగిసింది.

కర్నూలు లీగల్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీ నుంచి శుక్రవారం వరకు మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ది ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు, అన్ని జిల్లా కోర్టులలో మధ్యవర్తిత్వాన్ని ప్రవేశపెట్టడానికి నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. మధ్యవర్తిత్వం నిర్వహించడానికి ఉమ్మడి కర్నూలు జిల్లాలకు చెందిన న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లకు 40 గంటల పాటు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కేరళకు చెందిన శిక్షకులు సురేష్, జ్యోతిగోపినాథన్ పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.