Lemon Price Hike: నిమ్మ ధర రెట్టింపు
ABN , Publish Date - Apr 07 , 2025 | 05:05 AM
వేసవి వల్ల నిమ్మకాయల ధరలు రెట్టింపు అయ్యాయి. క్వింటాకు రూ.6వేలు ఉన్న ధర ఇప్పుడు రూ.12వేలకు చేరింది

నెల రోజుల్లో 6 వేల నుంచి 12 వేలకు క్వింటా
అమరావతి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): వేసవి ప్రభావంతో నిమ్మకాయల ధర పెరుగుతోంది. గత నెలలో క్వింటా రూ.6 వేలు ఉన్న ధర ప్రస్తుతం రూ.12 వేలకు చేరింది. ఎండలు, వడగాల్పులు పెరిగే కొద్దీ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెప్తున్నారు. రాష్ట్రంలో ఏలూరు, దెందులూరు, తెనాలి, రాపూరు హోల్‌సేల్ మార్కెట్లకు రోజూ 2వేల క్వింటాళ్ల దాకా నిమ్మకాయలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 20వేల ఎకరాల్లో నిమ్మతోటలున్నాయి. ఏటా 10లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. వేసవిలో దిగుబడి తగ్గినా.. 4లక్షల టన్నుల దాకా ఉత్పత్తి వస్తుంది. నీటి వసతి ఉన్న తోటలకు ఈ ఏడాది కాపు బాగానే ఉంది. అయితే ఎండు తెగులు, మంగు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఒక్కో నిమ్మకాయ సైజును బట్టి రూ.4 నుంచి రూ.పది వరకు అమ్ముతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..
Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్