NMD Farooq: మంత్రి ఫరూక్‌కు సతీవియోగం
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:27 AM
రెండేళ్లుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. పవిత్ర శుక్రవారమే అంత్యక్రియలు చేయాలని పెద్దలు నిర్ణయించిన మేరకు హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు.

నంద్యాల మున్సిపాలిటీ, మార్చి 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సతీమణి షహనాజ్ (69) శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. రెండేళ్లుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. పవిత్ర శుక్రవారమే అంత్యక్రియలు చేయాలని పెద్దలు నిర్ణయించిన మేరకు హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు.
ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు, పవన్, లోకేశ్
షహనాజ్ మృతి విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ఇతర మంత్రివర్గ సహచరులు ఫరూక్‌ను ఫోన్‌లో పరామర్శించారు.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే