Government Hospitals: రోగుల సంతృప్తే ప్రధానం
ABN , Publish Date - Feb 06 , 2025 | 04:44 AM
వివిధ అంశాలపై సర్వేలో వచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకు ఎక్కడెక్కడ లోపాలున్నాయో సవరించుకుని సేవల్ని మెరుగుపర్చుకోవాలి. ప్రభుత్వాసుపత్రుల్లో 30 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను మరింత పటిష్ఠంగా అమలు చేయాలి.

ఓపీ సేవలను పటిష్ఠంగా అమలు చేయాలి: మంత్రి సత్యకుమార్
అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల విషయంలో రోగులు సంతృప్తి చెందడమే ప్రాతిపదికగా డాక్టర్లు పని చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని జీజీహెచ్‌ల సూపరింటెండెంట్లతో ఐవీఆర్‌ఎస్ ఫీడ్ బ్యాక్‌పై బుధవారం వెలగపూడిలో సచివాలయంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘వివిధ అంశాలపై సర్వేలో వచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకు ఎక్కడెక్కడ లోపాలున్నాయో సవరించుకుని సేవల్ని మెరుగుపర్చుకోవాలి. ప్రభుత్వాసుపత్రుల్లో 30 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను మరింత పటిష్ఠంగా అమలు చేయాలి. ఉదయం రోగిని చూసిన వైద్యుడే, సాయంత్రం రిపోర్టులు వచ్చిన తర్వాతా చూడాలి. ఓపీ సేవలను మరింత పటిష్ఠంగా అమలు చేయాలి. పేద రోగులు సంతృప్తి చెందేలా సేవలందించాలి’ అని స్పష్టం చేశారు. ఐవీఆర్‌ఎస్ సర్వే ఆధారంగా సేవల్ని మెరుగుపర్చాలని ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సేవల విషయంలో సూపరింటెండెంట్లే పూర్తి బాధ్యత వహించాలన్నారు.
రెడ్‌క్రాస్ సహకారంతో రక్త నిల్వల పెంపు: మంత్రి
రెడ్‌క్రాస్ సంస్థ సహకారంతో ప్రభుత్వాసుపత్రుల్లో రక్త నిల్వలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ చెప్పారు. బుధవారం సచివాయంలో మంత్రిని రెడ్‌క్రాస్ కొత్త చైర్మన్ వైడీ రామారావు, కోశాధికారి పి.రామచంద్రరాజు కలిశారు. రెడ్‌క్రాస్ సంస్థ సేవల్ని విస్తరించేందుకు ప్రభుత్వం తరఫున సహకరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Nara Lokesh : జగన్ సెక్యూరిటీపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan: విశాంత్రిలో పవన్ కళ్యాణ్.. అసలు విషయం ఇదే..