Guntur farmers protest: మిర్చి ధర భారీగా పతనం
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:59 AM
గుంటూరులో తేజ రకం ఎండుమిర్చి ధర క్వింటాల్‌కు రూ.9 వేలకూ చేరకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. గుంటూరు-హైదరాబాద్ హైవే దిగ్బంధించి, కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులతో చర్చల అనంతరం ఆందోళన విరమించారు.

తేజ రకం క్వింటాల్ రూ.9 వేల లోపే
వ్యాపారుల మాయాజాలం ఫలితం?
గుంటూరులో రైతుల ఆందోళన
4 గంటలకు పైగా హైవే దిగ్బంధం
గుంటూరు, మార్చి 25(ఆంధ్రజ్యోతి): విదేశాలకు ఎగుమతి జరిగే తేజ రకం ఎండుమిర్చి ధర భారీగా పతనమైంది. రెండేళ్ల క్రితం క్వింటాల్ రూ. 23 వేలు ఉన్న ధర నేడు రూ.9 వేలు కూడా రాని పరిస్థితి! దీంతో మిర్చి రైతులు మంగళవారం గుంటూరులోని మిర్చి యార్డు వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి గుంటూరు-హైదరాబాద్ హైవే దిగ్బంధించా రు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్ చేశా రు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ రాస్తారోకోతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సీజన్ ప్రారంభంలో క్వింటాల్ మిర్చి రూ.10 వేలు ఉండగా.. సంక్రాంతి తర్వాత రూ.13 వేల వరకు వెళ్లింది. అయితే కొద్ది రోజుల నుంచి మిర్చిలో తాలు, తేమ శాతం అధికంగా ఉం టోందని, కాయ సైజు చిన్నదిగా ఉంటోందని కొనుగోలుదారులు ధర కోసేస్తున్నారు. కర్ణాటకలోని రాయ్‌చూర్, బళ్లారి, హుబ్లీ, కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం, దోర్నాల, యర్రగొండపాలెం, పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి, వినుకొండ తదితర ప్రాంతాల నుంచి రైతులు నిత్యం లక్షా 20 వేలకు పైగా మిర్చి బస్తాలను విక్రయించేందుకు గుంటూరుకు తీసుకొస్తున్నారు. అయితే తొలి రోజున వ్యాపారస్తులు కొనుగోళ్లు చేయకుండా రైతులను నిరీక్షించేలా చేస్తున్నారు. రెండో రోజు ఎగుమతిదారు వచ్చి తొలుత ఒక రేటుకి ఒప్పందం చేసుకుంటున్నా డు. కాసేపటికి ఆయన గుమాస్తా వచ్చి శాంపిల్ కాయలు తీయించి, నాణ్యత లేదని క్వింటాల్‌కు రూ.వెయ్యి కోత పెడుతున్నాడు. దీంతో క్వింటాల్‌కు బట్టి రూ.7 వేల నుంచి రూ.9 వేల ధర మాత్రమే చెల్లిస్తున్నారు.
అధికారుల చర్చలు.. ఆందోళన విరమణ
వ్యాపారులు కూడబలుక్కొని ధర తగ్గించేయడంతో రైతులు ఆందోళన కు దిగారు. ఈ విషయం మార్కెటింగ్ శాఖ దృష్టికి వెళ్లడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు జాయింట్ కలెక్టర్ భార్గవతేజ, మిర్చియార్డు సెలెక్షన్‌గ్రేడ్ సెక్రటరీ చంద్రిక వచ్చి రైతులతో చర్చలు జరిపారు. ప్రభు త్వం ప్రకటించిన ఎంఎ్‌సపీ ధర క్వింటాల్‌కు రూ.11,781 చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. దీనిపై జేసీ స్పందించి.. సమస్యలను ప్రభుత్వానికి నివేదించి ఆదుకొంటామని చెప్పి ఆందోళనను విరమింపచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ