Dubai: రంజాన్ మాసంలో కార్మికులకు భోజన సామగ్రి అందించిన దుబాయి తెలుగు అసోసియెషన్
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:13 PM
దుబాయిలోని తెలుగు ప్రవాసీ సంఘమైన ‘తెలుగు అసోసియెషన్’ రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని దుబాయిలో భారతీయ కార్మికులు పెద్ద సంఖ్యలో నివసించే సోనాపూర్‌లో కార్మికుల మధ్య ఇటీవల నిర్వహించింది.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దుబాయిలో ఇఫ్తార్ విందును స్థానిక అరబ్బులతో పాటు ఇక్కడ నివాసముంటున్న భారతీయులు విభిన్న రీతులలో జరుపుకుంటారు. అనేకులు తమ మిత్రబృందంతో కలిసి విందును, కొందరు ఎడారి ఇస్త్రార్హాలలో లేదా హోటళ్ళలో, మరికొందరు పేద కార్మికుల మధ్య జరుపుకొంటూ తమ ధార్మిక మాసంలో తమ సేవా భావాన్ని చాటుతారు.
అందునా, తమ ఇష్టపూర్వకంగా ఒక మతస్థులు మరొకరి ఆహార అవసరాలను గుర్తించి వారి వద్దకు వెళ్ళి వారికి అవసరమైన సామగ్రిని సమకూర్చిన వారు విశాల హృదయులు. అందునా హిందూ, ముస్లిం, క్రైస్తవులు కలిసికట్టుగా చేసే ఈ రకమైన సేవలతో మైత్రి వెల్లివెరిసింది. అది దైవ కార్యంగా భావించి నిర్వహిస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. భారతీయ వసుధైక కుటుంబ విలువలు ఇతరులకు తెలుస్తాయి.
Also Read: బహ్రెయిన్ తెలుగు కళా సమితి ఇఫ్తార్ విందులో అరబ్బు ప్రముఖులు
దుబాయిలోని తెలుగు ప్రవాసీ సంఘమైన ‘తెలుగు అసోసియెషన్’ రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని దుబాయిలో భారతీయ కార్మికులు పెద్ద సంఖ్యలో నివసించే సోనాపూర్‌లో కార్మికుల మధ్య ఇటీవల నిర్వహించింది. తెలుగు చిన్నారులు, మహిళలు కూడా ఈ కార్యక్రమంలో ఎనలేని ఆసక్తితో పాల్గొన్నారు. విదేశాలలో పుట్టి పెరుగుతున్న చిన్నారులకు సేవా భావాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఈ రకమైన కార్యక్రమాలలో వారిని భాగస్వామ్యం చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. భోజన సామగ్రి పంపిణీ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ డైరెక్టర్ భీం శంకర్ బంగారి, లతా నగేశ్‌లు కీలక పాత్ర పోషించారని వారన్నారు.
ఒక్క రోజు ఒక్క పూటకు ఆలోచించకుండా కార్మికులకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, భోజన సామగ్రిని అందిస్తే రంజాన్ మాసంలో నిజమైన దాతృత్వమని తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు దినేష్ కుమార్ ఉగ్గిన, మసియోద్దీన్ మోహమ్మద్‌లు తెలిపారు. రంజాన్, ఉగాది, దసరా, బతుకమ్మ, దీపావళి, క్రిస్మస్ అన్ని పండగులలో తెలుగు ప్రవాసీయుల సుఖసంతోషాలే తమ సంస్థ లక్ష్యమని వారు పేర్కొన్నారు.
Also Read: దుబాయ్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
దుబాయి ప్రభుత్వ సామాజిక సేవా కార్యక్రమాల సంస్థ అయిన సి.డి.ఏ అధికారులు ముసాద్ మహమ్మద్ అల్ భ్లోషి, అబ్దుల్లా యూసుఫ్ అల్ మన్సూరిలు కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొన్నట్లుగా వారు వెల్లడించారు.
కార్యక్రమంలో దుబాయిలోని తెలుగు ప్రవాసీ ప్రముఖులు సుదర్శన్ కటారుతో పాటు శ్రీధర్ దమార్ల, రాజీవ్ చింతకాయల, శేఖ్ షా వలీ, శ్రీనివాస రావు యెండూరి, ప్రకాశ్, శ్రీధర్ దామర్లలు పాల్గోన్నారు. కార్యక్రమాన్ని అనంత అచంట, గణేశ్‌ల సౌజన్యంతో నిర్వహించినట్లూగా నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి

డాలస్‌లో టీపాడ్ బ్లడ్ డ్రైవ్.. వెల్లువెత్తిన స్పందన

తానా సదస్సుకు ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎండికి ఆహ్వానం

TANA: జులైలో డెట్రాయిట్లో 24వ తానా మహా సభలు

బహ్రెయిన్‌లో వైభవంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలుగు ఎన్నారైలకు దుబాయిలో జీఎమ్సీ ఇఫ్తార్ విందు
