బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:44 AM
బ్యాంకు ఉద్యోగుల సమ స్యల పరిష్కారానికి ఫైనాన్స్ మంత్రిత్వశాఖ, డీఎఫ్‌ఎస్ ఆధ్వర్యంలో సాను కూలంగా స్పందిం చడంతో సమ్మె వాయిదా వేసినట్లు బ్యాంకు యూనియ న్ నాయకులు తెలిపారు.

ఒంగోలు కలెక్టరేట్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): బ్యాంకు ఉద్యోగుల సమ స్యల పరిష్కారానికి ఫైనాన్స్ మంత్రిత్వశాఖ, డీఎఫ్‌ఎస్ ఆధ్వర్యంలో సాను కూలంగా స్పందిం చడంతో సమ్మె వాయిదా వేసినట్లు బ్యాంకు యూనియ న్ నాయకులు తెలిపారు. శుక్రవారం ఒంగోలులోని ఎస్‌బీఐ బ్యాంకు వద్ద జరిగిన కార్యక్రమంలో యూఎఫ్‌బీయూ కన్వీనర్ రాజీవ్‌రత్నదేవ్ మాట్లాడు తూ తాము చేపట్టిన సమ్మెపై సానుకూలంగా స్పందించడంతో తాత్కాలి కంగా వాయిదా వేసినట్లు తెలిసారు. ఏప్రిల్ మూడవ వారంలో ఫైనాన్స్ మంత్రిత్వ శాఖతో బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై సమవేశం జరుగు తుం దన్నారు. ఈ సందర్భంగా సమస్యలపై సానుకూలంగా స్పందించకపోతే భ విష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు వి.శ్రీనివాసరావు, సుబ్బారావు, ఉమాశంకర్, వెంకటరెడ్డి, శ్రీధర్, బ్రహ్మయ్య, శ్రీనివాసరావు, సుధాకర్‌రావు, హసన్, బ్రహ్మనాయుడు, ఏడుకొం డలు, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.