Share News

అభివృద్ధికే బడ్జెట్‌లో ప్రాధాన్యం

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:58 PM

మునిసిపల్‌ బడ్జెట్‌ కౌన్సిల్‌ సమావేశం ప్రశాతంగా ముగిసింది. 2025-26కు సంబంధించి జరిపిన బడ్జెట్‌ కేటాయింపుల్లో అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం నిధులు రూ62.64కోట్లు ప్రవేశపెట్టగా, అందులో అభివృద్ధి పనులకు సం బంధించి రూ.39కోట్లు, సాధారణ ఖర్చు లు (ఇంధనం, జీతాలు, వగైరా ఖర్చులు) రూ.22 కోట్లకు కేటాయింపులు జరిపారు.

అభివృద్ధికే బడ్జెట్‌లో ప్రాధాన్యం
బడ్జెట్‌ సమావేశంలో ఎమ్మెల్యే కొండయ్యను గజమాలతో సత్కరిస్తున్న మునిసిపల్‌ చైర్మన్‌, అధికారులు, కౌన్సిలర్‌లు

క్రిటికల్‌ కేర్‌కు కృషి చేసిన ఎమ్మెల్యే కొండయ్యను ఘనంగా సన్మానించిన పాలకవర్గం, అధికారులు

ప్రశాంతంగా ముగిసిన మునిసిపల్‌ బడ్జెట్‌ సమావేశం

చీరాల, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : మునిసిపల్‌ బడ్జెట్‌ కౌన్సిల్‌ సమావేశం ప్రశాతంగా ముగిసింది. 2025-26కు సంబంధించి జరిపిన బడ్జెట్‌ కేటాయింపుల్లో అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం నిధులు రూ62.64కోట్లు ప్రవేశపెట్టగా, అందులో అభివృద్ధి పనులకు సం బంధించి రూ.39కోట్లు, సాధారణ ఖర్చు లు (ఇంధనం, జీతాలు, వగైరా ఖర్చులు) రూ.22 కోట్లకు కేటాయింపులు జరిపారు. అలాగే మిగులు బడ్జెట్‌ రూ.60.52లక్షలు ఉంటుందని అధికారులు వివరించారు. అయితే కేటాయింపుల్లో ఒకటి రెండు అం శాలపై స్వల్పంగా చర్చలు జరిగినప్పటికీ మిగతా అంశాలపై ప్రశాంతంగా ముగిసింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే కొండయ్య ఏరియా ఆసుపత్రికి క్రిటికల్‌ కేర్‌ను తీసుకురావడంపై సభ్యులంతా హర్షం వ్యక్తం చేశారు. సమావేశం ముగిశాక గజమాలతో ఆయన్ని ఘనంగా సన్మానించారు.

భేషజాలు లేవు..అభివృద్ధికి సహకరిం

చండి - ఎమ్యెల్యే కొండయ్య

సభా సమయంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీలకు, ఇతర అనవసరమైన అంశాలకు ప్రాధాన్యమివ్వనని స్పష్టంగా చెప్పారు. నమ్మి ప్రజలు తనను గెలిపించాలరని, ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో అభివృద్ధికి కలిసి కట్టుగా పని చేద్దామని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. టీడీపీ కూటమి పూర్తిగా అభివృద్ధిపైనే దృష్టి సారించిందని ప్రకటించగా హర్షధ్వానాలతో సభా ప్రాంగణం మారుమోగింది.

గిన్నిస్‌ బుక్‌లో మెప్మా మొదటి స్థానం

సాధించడంపై అభినందనలు

ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మూడు రకాల కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న మెప్మా విభాగం గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించడంపై ఎమ్మెల్యే కొండయ్య మెప్మా విభాగం ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. ఒకేరోజు 10 వేల మంది ఎన్‌ఎంఎ్‌స శిక్షణలో పాల్గొని, పరీక్షకు హాజరుకావడం, అలాగే రాష్ట్ర వ్యా ప్తంగా మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన మార్ట్‌లో చీరాల నుంచి అత్యఽధికంగా కొనుగోలు చేయడం,అధిక సంఖ్యలో పొదుపు మహిళా సంఘాలు ఇక్కడే ఉం డడంపై చీరాల మెప్మా విభాగం గిన్నీస్‌ బుక్‌లో రికార్డు సాధించిందని వివరించా రు. ఎమ్మెల్యే కొండయ్య చీరాల మెప్మా విభాగం సీఏఎం కొండయ్య, ఆర్పీలు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో మునిసిల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, వైస్‌ చైర్మన్‌ బొనిగల జైసన్‌బాబు, కమిషనర్‌ అబ్దుల్‌ రషీద్‌, డీఈ రఘురాం, కౌన్సిలర్‌లు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 11:58 PM