మార్చిలోనే మంటలు
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:31 AM
జిల్లాలో శనివారం ఎండలు మండి పోయాయి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు సుర్రుమనిపించాడు. మధ్యాహ్నానికి మోతాడు పెంచాడు. దీంతో ప్రజానీకం గడపదాటి బయటకు వచ్చేందుకు భయపడిపోయారు.

20 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు
పెద్దారవీడులో 43.5 డిగ్రీలు నమోదు
ప్రజానీకం ఇక్కట్లు
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో శనివారం ఎండలు మండి పోయాయి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు సుర్రుమనిపించాడు. మధ్యాహ్నానికి మోతాడు పెంచాడు. దీంతో ప్రజానీకం గడపదాటి బయటకు వచ్చేందుకు భయపడిపోయారు. మార్చిలోనే మంటలు మొదలవడంతో మున్ముందు పరిస్థితిని ఊహించుకొని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 20 మండలాల్లో శనివారం 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్దారవీడులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఎండకాచింది. ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు ఉక్కపోత ఉండటంతో ప్రజలు శీతలపానీయాలు తాగి సేదతీరుతున్నారు.