Share News

పంట కాలువలపై అక్రమ కట్టడాలు

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:54 AM

కంభం చెరువు పంట కాలువలు ఆక్రమణలకు గురవుతున్నాయి. కాలువ గట్లపైనే కొందరు యథేచ్ఛగా అక్రమ కట్టడాలు, వంతెనలు నిర్మించారు.

పంట కాలువలపై అక్రమ కట్టడాలు

కంభం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): కంభం చెరువు పంట కాలువలు ఆక్రమణలకు గురవుతున్నాయి. కాలువ గట్లపైనే కొందరు యథేచ్ఛగా అక్రమ కట్టడాలు, వంతెనలు నిర్మించారు. దీంతో కాలువల్లో పూడిక తీసేందుకు అంతరాయం ఏర్పడడమే కాకుండా, పొలాలకు నీరు సక్రమంగా వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. ఇప్పటికే నక్కలగండి కాలువల, ప్రధాన పంటకాలువలను ఇరువైపులా ఆక్ర మించి పక్కాగృహాలు నిర్మించుకున్నారు. ఇందిరమ్మ పథకం కింద మంజూరు చేసిన ఇళ్లస్థలాల పేరుతో ఆర్టీసీ బస్టాండ్‌ ముందు వైపు, రావిపాడు వెళ్లే మార్గంలో కొందరు చప్టాలను, బహుళ అంతస్తులను నిర్మించారు. ఈ విధంగా నిర్మాణాలు కొనసాగడంతో ప్రధాన కాలువలన్నీ పిల్లకాలువలుగా, మురికి కాలువలుగా మారిపోయాయి. దీంతో రైతులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్‌ ప్రధాన కాలువల నుంచి తూములను ఎత్తేందుకు గతంలో జీపులు, లారీలు వెళ్లేవని, ప్రస్తుతం ఆక్రమణ కారణంగా నడిచేందుకు కూడా వీలులేకుండా పోయిందని వాపోతున్నారు. ఈ విషయంలో గతంలో ఎన్నోసార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలి తం లేదని స్థానికులు చెబుతు న్నారు. ఇటీవల ఇరిగేషన్‌, రెవె న్యూ అధికారులు అక్రమ కట్టడాలను పరిశీలించి ఆక్రమణ దారులకు నోటీసులు ఇచ్చారు. అయినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఇరిగేషన్‌ కాలువల మరమ్మతులకు పూడికతీతకు రూ.36లక్షలు మంజూ రు కాగా 3 నెలలక్రితం కాలువలో పూడిక తీసి గట్లపైనే పడేశారు. ప్రస్తుతం ఆ చెత్త కాలువలోనికి చేరుతోంది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురిం చింది. స్పందించిన ఏఈ శ్రీనివాస్‌ నాయక్‌ వారంలోపు కాలువగట్లపై ఉన్న పూడికను తీయిస్తానని చెప్పారు. ఆ సమయం దాటి నెలగడిచినా, సమస్య పరిష్కరించలేదని రైతులు పేర్కొంటున్నారు.

Updated Date - Mar 19 , 2025 | 12:54 AM