ఆ ఐదు సమస్యల పరిష్కారం కోసమే నా తపన
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:18 AM
కనిగిరి ప్రాంతం అభివృద్ధికి తాను 5 సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగుతున్నానని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం దివాకరపల్లిలో బుధవారం రిలయన్స్ సీబీజీ ప్లాంట్ భూమి పూజా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ ఇక్కడి వాసులు పనులు లేక వలసలు పోయి పరాయి ప్రాంతాల్లో జీవిస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఉపాధి, ఉద్యోగావకాశలు లభించాలనే సంకల్పంతో ఉన్నానన్నారు. తన సంకల్పాన్ని మంత్రి లోకేష్ తీర్చటం ఆనందంగా ఉందన్నారు

మంత్రి లోకేష్ సహకారం మరువలేను
వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలి
మంత్రి లోకే్‌షకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర సతీమణి, తనయ, తనయులు
కనిగిరి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : కనిగిరి ప్రాంతం అభివృద్ధికి తాను 5 సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగుతున్నానని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం దివాకరపల్లిలో బుధవారం రిలయన్స్ సీబీజీ ప్లాంట్ భూమి పూజా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ ఇక్కడి వాసులు పనులు లేక వలసలు పోయి పరాయి ప్రాంతాల్లో జీవిస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఉపాధి, ఉద్యోగావకాశలు లభించాలనే సంకల్పంతో ఉన్నానన్నారు. తన సంకల్పాన్ని మంత్రి లోకేష్ తీర్చటం ఆనందంగా ఉందన్నారు. ఆయన పాదయాత్ర సమయంలో కనిగిరి ప్రాంత సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించటం గమనించానన్నారు. ఆరోజే అనుకున్నానని లోకేష్ ద్వారా కనిగిరి ప్రాంతం అభివృద్ధి చెంది తీరుతుందని ఉగ్ర పేర్కొన్నారు. అందులో తొలి అడుగే రిలయన్స్ సీబీజీ ప్లాంట్ ఏర్పాటుకు శ్రీకారం అన్నారు. అదేవిధంగా ఇంటింటికి తాగునీటి కుళాయిల ద్వారా నీటిని అందిస్తే ప్రజలకు నీటి సమస్య తీరుతుందని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. నడికుడి రైల్వేలైన్ ఈ ప్రాంతంలో పూర్తి చేసేందుకు మంత్రి లోకేష్ నిధులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, అందుకు రుణపడి ఉంటామన్నారు. ట్రిపుల్ ఐటీని కనిగిరిలో పూర్తి చేసేందుకు లోకేష్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. వెలిగొండ జలాలతో కనిగిరి ప్రాంతంలోని ప్రతి నేల తడవాలన్న తన సంకల్పం నెరవేరుతుందన్నారు. ప్రధానమైనఈ 5 సమస్యలు పరిష్కారం అయితే కనిగిరి అభివృద్ధికి బాటలు పడి ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. కనిగిరి ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే వైసీపీ నేతలు చూసి ఓర్వలేక పోతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీబీజీ ప్లాంట్ ఏర్పాటు వలన ప్రజలకు ఒళ్లు మంటలు, ఎలర్జీలు వస్తాయని లేనిపోని ప్రచారం రేపుతున్నారన్నారు. ప్రజలకు కాదని వైసీపీ నేతలకు ఒళ్ళు, కళ్ళు మంటలు పుట్టి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలు మానుకుంటే బావుంటుందని సూచించారు. ఉదయం 9 గంటలకే కార్యక్రమం అని పిలుపునివ్వటంతో వేకువజాము నుంచే కనిగిరి ప్రాంతంలోని ప్రతి పల్లె నుంచి అశేషంగా తరలివచ్చిన ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు, శ్రేణులకు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనతో పాటు యావత్తు అధికార యంత్రాంగం ఎంతో శ్రమించి కార్యక్రమం విజయవంతంలో భాగస్వాములైన వారికి ఎమ్మెల్యే ఉగ్ర అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. తొలుత హెలిప్యాడ్ వద్ద ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర సతీమణి, ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యురాలు డాక్టర్ కవిత, తనయ, తనయుడు భరతసిహారెడ్డిలు మంత్రి లోకే్‌షను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సభావేదికపై లోకే్‌షను ఘనంగా సత్కరించారు.