Share News

కొడుకు మరణ ధ్రువీకరణపత్రం కోసం పాట్లు

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:45 PM

కన్నకొడుకు చనిపోగా మరణధ్రువీకరణపత్రం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న ఓ వృద్ధ తండ్రి గోడు ఇది. బాధిత వృద్ధుడు తెలిపిన వివరాల మేరకు మండలంలోని లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన కోటపాటి లక్ష్మీనరసయ్య కొడుకు ఈ ఏడాది జనవరి 12వతేదీన అనారోగ్యంతో మృతిచెందాడు. మృతిచెందిన తన కొడుకు మరణ ధ్రువీకరణపత్రం కోసం లక్ష్మీనరసయ్య పంచాయతీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు.అయితే దరఖాస్తు నిర్ణీత గడువులోగా చేసుకోలేదని అందువల్ల మరణ ధ్రువపత్రం ఇవ్వలేమని ఎమ్మార్వో ఆఫీసుకు పోవాలంటూ కార్యదర్శి చెప్పారు.

 కొడుకు మరణ ధ్రువీకరణపత్రం కోసం పాట్లు
తన కొడుకు మరణ ధ్రువీకరణపత్రం ఇప్పించాలంటూ మీడియా దృష్టికి తీసుకువచ్చిన లక్ష్మీనరసయ్య

పీసీపల్లి,మార్చి26(ఆంధ్రజ్యోతి): కన్నకొడుకు చనిపోగా మరణధ్రువీకరణపత్రం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న ఓ వృద్ధ తండ్రి గోడు ఇది. బాధిత వృద్ధుడు తెలిపిన వివరాల మేరకు మండలంలోని లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన కోటపాటి లక్ష్మీనరసయ్య కొడుకు ఈ ఏడాది జనవరి 12వతేదీన అనారోగ్యంతో మృతిచెందాడు. మృతిచెందిన తన కొడుకు మరణ ధ్రువీకరణపత్రం కోసం లక్ష్మీనరసయ్య పంచాయతీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు.అయితే దరఖాస్తు నిర్ణీత గడువులోగా చేసుకోలేదని అందువల్ల మరణ ధ్రువపత్రం ఇవ్వలేమని ఎమ్మార్వో ఆఫీసుకు పోవాలంటూ కార్యదర్శి చెప్పారు. దీంతో ఆ గ్రామ వీఆర్వోను సంప్రదించాడు.మరణ ధ్రువీకరణపత్రం పంచాయతీకార్యాలయంలోనే తీసుకోవాలని ఉచిత సలహా ఇచ్చాడు.పంచాయతీ కార్యాలయానికి వెళ్తే వీఆర్వో దగ్గరకు వెళ్లమని, వీఆర్వో దగ్గరకు వెళ్తే పంచాయతీ కార్యాలయానికి వెళ్లమని చెప్తూ ఆ వృద్ధుడిని కాళ్లరిగేలా తిప్పుతున్నారు.మృతుడు సత్తిబాబు బీమా కలిగి ఉండడంతో ఆయన కుటుంబసభ్యులు మరణ ధ్రువీకరణపత్రం లేని కారణంగా బీమా నుండి వచ్చే నగదును పొందలేకపోతున్నారు. దీంతో విసిగి వేసారిన వృద్ధుడు లక్ష్మీనరసయ్య బుధవారం విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చాడు.ఈ విషయాన్ని ఎమ్మెల్యే పీఏ ప్రసాదు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే వీఆర్వోకు ఫోన్‌చేసి తక్షణమే మరణఽ ధ్రువీకరణపత్రం ఇవ్వాలని సూచించారు.అయితే అధికారులు ఇప్పటికైనా మరణ ధ్రువీకరణపత్రాన్ని ఇస్తారో లేదో వేచిచూడాలి.

Updated Date - Mar 26 , 2025 | 11:46 PM