Share News

పింఛన్‌ సొమ్ము రెడీ

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:36 AM

బ్యాంకులకు వరుస సెలవులు వచ్చినప్పటికీ ఏప్రిల్‌ ఒకటో తేదీనే పింఛన్లను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్‌ భరోసా కింద ఇస్తున్న పింఛన్ల పంపిణీని రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పింఛన్‌దారుల చేతికి ఒకటో తేదీన సొమ్మును అందించాల్సిందేనని నిర్ణయించింది.

పింఛన్‌ సొమ్ము రెడీ

ఏప్రిల్‌ ఒకటిన పంపిణీ

వరుస బ్యాంకు సెలవులతో ముందుగానే డబ్బులు డ్రా చేసిన సిబ్బంది

ఒంగోలు నగరం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : బ్యాంకులకు వరుస సెలవులు వచ్చినప్పటికీ ఏప్రిల్‌ ఒకటో తేదీనే పింఛన్లను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్‌ భరోసా కింద ఇస్తున్న పింఛన్ల పంపిణీని రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పింఛన్‌దారుల చేతికి ఒకటో తేదీన సొమ్మును అందించాల్సిందేనని నిర్ణయించింది. ఒకటో తేదీ ఆదివారం అయితే ముందు రోజునే పంపిణీ చేస్తోంది. కాగా ఏప్రిల్‌ ఒకటో తేదీన పింఛన్లను పంపిణీ చేసేందుకు బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో జిల్లాలోని సచివాలయ సిబ్బంది రెండురోజుల ముందుగానే సొమ్మును డ్రా చేశారు. ఈనెల 30వతేదీన ఆదివారం..పైగా ఉగాది పర్వదినం కావడంతో బ్యాంకులు పనిచేయవు. 31వతేదీన రంజాన్‌ పండుగ సందర్భంగా కూడా బ్యాంకులకు సెలవే. దీంతో 30, 31వ తేదీన బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసేందుకు అవకాశం లేదు. ఏప్రిల్‌ ఒకటో తేదీన డ్రా చేస్తే పంపిణీని ప్రారంభిం చేందుకు రెండో తేదీ అవుతుంది. కానీ రాష్ట్రప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటో తేదీనే పింఛన్లను పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉంది. దీంతో జిల్లాలోని 717 సచి వాలయాల సిబ్బంది శనివారం నాడే బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకుని ఒకటో తేదీన పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచుకున్నారు. ఎన్టీఆర్‌ భరోసా కింద జిల్లాలో మొత్తం 2,84,684 మంది పింఛన్లు పొందుతున్నారు. అందు కోసం ప్రతి నెలా రూ.124.64 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తోంది. ప్రతి నెలాఖరులో ఈ నిధులు విడుదలవుతాయి. ఈసారి మార్చి చివర్లో రెండు రోజులపాటు బ్యాంకులకు సెల వులు రావడంతో రాష్ట్రప్రభుత్వం కూడా ముందుగానే రూ.124.64కోట్లు జమ చేసింది. ఆ మొత్తాన్ని సచివాల యాల సిబ్బంది ముందుగానే డ్రా చేసుకున్నారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ ఉదయాన్నే పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.

Updated Date - Mar 30 , 2025 | 01:36 AM