Quick Muscle Relief After Workout: వ్యాయామం తరువాత
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:54 AM
వ్యాయామం తరువాత శరీరంలో కండరాలు నొప్పిగా ఉంటాయి. వాటిని తగ్గించడానికి ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో ఉన్న ఆహారాలు ఉపయోగపడతాయి. వాటిలో గుడ్లు, బాదం, చేపలు, పళ్లు, ఫలాలు, తదితర ఆహారాలు ఉన్నాయి.

వ్యాయామం చేసిన తరువాత ఆలసటగా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు కండరాలు పట్టేసినట్లు నొప్పిగా ఉంటాయి. వీటినుంచి ఉపశమనం పొందేందుకు తీసుకోవాల్సిన ఆహారం గురించి నిపుణులు ఇలా చెబుతున్నారు.
గుడ్లలో ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. వ్యాయామం తరవాత ఉడికించిన గుడ్లు తింటే కండరాల నొప్పి తగ్గుతుంది
బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ తినడం మంచిది. వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు కలిసి శరీరానికి శక్తిని అందిస్తాయి.
చీజ్, చియా గింజలు, అవిసె గింజలతోపాటు సాల్మన్, ట్యూనా, మాకెరెల్ లాంటి చేపలను ఆహారంలో చేర్చుకుంటే కండరాల వాపు, నొప్పి తగ్గుతాయి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు... శరీరానికి మేలు చేస్తాయి.
అరటి పండు, స్ట్రాబెర్రీ, పైనాపిల్ తినడం వల్ల శరీరంలోని కణాలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలు బలోపేతమవుతాయి.
వ్యాయామం తరవాత శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీనిని భర్తీ చేసేందుకు పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మంచినీళ్లు, పలుచని మజ్జిగ తాగడం మంచిది. కేరట్, బీట్‌రూట్, టమాటాలతో చేసిన రసం తాగినా మంచి ఫలితం కనిపిస్తుంది.
మొలకలు, కీరా, కేరట్ ముక్కలతోపాటు తాజా పళ్లు తినడం మంచిది.
ఇవి కూడా చదవండి:
800 ఏళ్ల పురాతన శివాలంలో అద్భుతం
Milk: పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. డేంజర్
Pilot forgets Passport: గగనతలంలో ఉండగా జరిగిన పొరాపాటు గుర్తొచ్చి పైలట్‌కు షాక్.. విమానం యూటర్న్!