Share News

ఇఫ్తార్‌ తో స్నేహ సంబంధాలు మెరుగు

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:52 PM

ఇఫ్తార్‌ విందులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల మధ్య స్నేహ సంబంధాలు మెరుగై పరమత సహనం ఏర్పడుతుందని ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ మండల ముస్లిం మైనార్టీసెల్‌ ఆధ్వర్యంలో స్థానిక విరువూరు రోడ్‌ పెద్ద మసీదు పక్కన పవిత్ర రంజాన్‌ ఉపవాసాలు ఆచరిస్తున్న ముస్లింలకు బుధవారం రాత్రి ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా ఉగ్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థన (దువ)లో ఉగ్ర పాలొన్నారు.

  ఇఫ్తార్‌ తో స్నేహ సంబంధాలు మెరుగు
ఇఫ్తార్‌ ప్రత్యేక ప్రార్థనలో పాలొన్న ఉగ్ర

పామూరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : ఇఫ్తార్‌ విందులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల మధ్య స్నేహ సంబంధాలు మెరుగై పరమత సహనం ఏర్పడుతుందని ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ మండల ముస్లిం మైనార్టీసెల్‌ ఆధ్వర్యంలో స్థానిక విరువూరు రోడ్‌ పెద్ద మసీదు పక్కన పవిత్ర రంజాన్‌ ఉపవాసాలు ఆచరిస్తున్న ముస్లింలకు బుధవారం రాత్రి ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా ఉగ్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థన (దువ)లో ఉగ్ర పాలొన్నారు. అల్లాహ్‌ దయ అందరిపై ఉండాలని ప్రార్థన చేసినట్లు తెలిపారు. పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లిం సహోదరులు కఠోర ఉపవాసాలతో పాటు భక్తిశ్రద్ధలతో ఉండటం విశేషమన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ కార్యక్రమంలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అలాగే సోమవారం జరిగే రంజాన్‌ పండుగను ముస్లింలు కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోవాలని కోరారు. వారందరికీ ముందస్తుగా రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని మసీదుల్లో పనిచేసే పేష్‌ ఇమాం, మౌజన్లకు టీడీపీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ ఖాజారహంతుల్లా సమకూర్చిన నూతన వస్ర్తాలను ఉగ్ర చేతుల మీదుగా అందజేసారు. అనంతరం ఇఫ్తార్‌ విందు భోజనాన్ని ఉగ్ర వడ్డించారు. ఈ కార్యక్రమంలో సీఐ ఎం. భీమానాయక్‌, ఎస్‌ఐ టి. కిశోర్‌బాబు, టీడీపీ నాయకుడు యారవ శ్రీనివాసులు, మాజీ సర్పంచ్‌ డీవీ మనోహార్‌, షేక్‌ షంషూర్‌, ఎంపీటీసీ సభ్యులు బొల్లా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 11:52 PM