Revenue Officials Notice: కేతిరెడ్డి సోదరుడి భార్యకు నోటీసులు
ABN , Publish Date - Apr 04 , 2025 | 05:18 AM
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోదరుడి భార్య గాలి వసుమతి రెడ్డి నోటీసులు అందుకున్న విషయం. వైసీపీ హయాంలో అసైన్‌మెంట్ భూమి కొనుగోలు చేసిన ఆమెపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు

అసైన్‌మెంట్ భూమి రిజిస్ట్రేషన్‌పై వివరణ కోరిన రెవెన్యూ అధికారులు
ధర్మవరం రూరల్, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోదరుడి భార్య గాలి వసుమతి రెడ్డికి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ధర్మవరం పట్టణ సమీపంలోని సర్వే నంబర్ 905-2లో 2.42 ఎకరాల భూమికి 1960లో మోటుమర్ల గ్రామానికి చెందిన అంకే నారాయణ, శ్రీహరిపురం గ్రామానికి చెందిన తలారి అంజినమ్మ, లక్ష్మీచెన్నకేశవపురం గ్రామానికి చెందిన ఓబులమ్మ పేరిట పట్టా ఇచ్చారు. ఈ భూమిని వైసీపీ హయాంలో వసుమతిరెడ్డి కోనుగోలు చేశారు. ఇది అసైన్‌మెంట్ భూమి అయినా, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. తొలుత పోస్టల్ ద్వారా నోటీసులు పంపగా, వెనక్కి వచ్చాయి. దీంతో స్వయంగా రెవెన్యూ అధికారులే గురువారం నోటీసులు తీసుకువెళ్లి ఇచ్చినట్టు తెలిసింది.