Share News

Right to Education: ఆర్టీఈ ఫీజుల ఖరారుకు కమిటీ

ABN , Publish Date - Apr 01 , 2025 | 03:56 AM

విద్యా హక్కు చట్టం (RTE) కింద పేద విద్యార్థులకు కేటాయించే సీట్ల ఫీజుల పునఃసమీక్ష కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో నెల రోజుల్లో కొత్త ఫీజులను సిఫారసు చేయనుంది

 Right to Education: ఆర్టీఈ ఫీజుల ఖరారుకు కమిటీ

నెల రోజుల్లో కొత్త ఫీజులు సిఫారసు

అమరావతి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద పేద విద్యార్థులకు కేటాయించే సీట్లకు సంబంధించిన ఫీజుల ఖరారుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. గత ప్రభుత్వంలో పట్టణాల్లో రూ.8 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,500, గిరిజన ప్రాంతాల్లో రూ.6,100 చొప్పున ఆర్టీఈకి ఫీజులు నిర్ణయించారు. ఆ ఫీజులతో సీట్లు కేటాయించడం సాధ్యం కాదని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కోర్టు ఆదేశాలతో ఫీజుల పునఃసమీక్షకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కమిటీకి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి చైర్మన్‌గా, సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా ఉంటారు. కమిటీ నెల రోజుల్లో కొత్త ఫీజులను సిఫారసు చేయనుంది.


ఆర్టీఈ కింద ప్రైవేటు పాఠశాలలు 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలి. ఆ ఫీజులను ప్రభుత్వం పాఠశాలలకు చెల్లిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 34వేల మంది విద్యార్థులు ఆర్టీఈ కింద సీట్లు పొంది చదువుతున్నారు. వారికి ప్రభుత్వం ఏడాదికి రూ.62 కోట్లు ఫీజులు చెల్లిస్తోంది

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 03:56 AM