Share News

మార్కెట్‌ ఆశీల వేలం పాట ఖరారు

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:36 PM

ఆమదాలవలస మునిసిపాలిటీకి సంబంధించిన మార్కెట్‌ ఆశీలువేలం పాట ఎట్టకేలకు ఖరారయ్యింది. శుక్రవా రం మునిసిపల్‌కార్యాలయంలో మేనేజర్‌ బిషోయ్‌ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి మూడోసారి మార్కెట్‌ ఆశీల వేలంపాట నిర్వహించా రు.

మార్కెట్‌ ఆశీల వేలం పాట ఖరారు
వేలంపాట నిర్వహిస్తున్న అధికారులు:

ఆమదాలవలస, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస మునిసిపాలిటీకి సంబంధించిన మార్కెట్‌ ఆశీలువేలం పాట ఎట్టకేలకు ఖరారయ్యింది. శుక్రవా రం మునిసిపల్‌కార్యాలయంలో మేనేజర్‌ బిషోయ్‌ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి మూడోసారి మార్కెట్‌ ఆశీల వేలంపాట నిర్వహించా రు. తొలుత సర్కారివారి పాట రూ.18 లక్షల 24 వేలుగా ఖరారు చేసి పాటను అధికారులు ప్రారంభించగా, కాంట్రాక్టర్‌ బొడ్డేపల్లి దాలినాయుడు రూ.22 లక్షల 50 వేలకు పాడిదక్కించుకున్నారు. ఈసందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ 22 లక్షల 50వేల రూపాయలకు అదనంగా ఐదు లక్షలు స్వీపర్‌ చార్జీలు చెల్లిం చాలని తెలిపారు.

Updated Date - Mar 28 , 2025 | 11:36 PM