Share News

public problems ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:58 PM

public problems నియోజకవర్గంలో ప్రజలు వారి సమస్య లను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. పోలాకి మండలం కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్‌ నిర్వహిం చారు.

public problems   ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు
పోలాకి: హౌసింగ్‌ అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట/పోలాకి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో ప్రజలు వారి సమస్య లను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. పోలాకి మండలం కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్‌ నిర్వహిం చారు. రేషన్‌ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గ్రామాల్లో కాలువలు ఏర్పాటు చేయాలని పలువురు వినతిపత్రాలు అందించారు. అలాగే గృహ నిర్మాణశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజవర్గంలో గృహ నిర్మాణ పనుల పై ఆరా తీశారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇళ్లు ఉండాలన్నారు. అన్హరులకు ఇళ్లు ఇస్తే ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో నాలుగు మండలాల హౌసింగ్‌ అధికా రులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నరసన్నపేట ప్రజాసదన్‌లో మంత్రి అచ్చెన్నా యుడు జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీ సభ్యత్వంతో గుర్తింపు

జలుమూరు (సారవకోట), మార్చి 26 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. సవరడ్డపనస పార్టీ కార్యాలయంలో బుధవారం సభ్యత్వం పొందిన వారికి గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్‌ బగ్గు అర్చన, పార్టీ మండల అధ్యక్షుడు ఽకత్తిరి వెంకటరమణ, పార్టీ రాష్ట్ర బీసీ సెల్‌ ప్రతినిధి ధర్మాన తేజకుమార్‌, నాయకులు సాధు చిన్నికృష్ణంనాయుడు, సురవరపు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 11:58 PM