వీఆర్‌కేపురం చెరువులో కోళ్ల వ్యర్థాలు
ABN , Publish Date - Mar 20 , 2025 | 11:48 PM
:మండలంలోని వీఆర్‌కేపురం ఊటి చెరు వులో చేపల మేతకు కోళ్ల వ్యర్థాలు వేస్తుండడంతో నీరు కలుషితమవు తోందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

టెక్కలి, మార్చి20(ఆంధ్రజ్యోతి):మండలంలోని వీఆర్‌కేపురం ఊటి చెరు వులో చేపల మేతకు కోళ్ల వ్యర్థాలు వేస్తుండడంతో నీరు కలుషితమవు తోందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. భీమవరం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి స్థానికులు దగ్గర చెరువు లీజుకు తీసుకున్నారు. ఇక్కడ పెంచుతున్న చేపలకు ఆహారంగా కోళ్లవ్యర్థాలను వేస్తుండడంతో కలుషిత నీటివల్ల వ్యాధులు ప్రబలే అవకాశముందని స్థానికులు వాపోతున్నారు. కాగా చెరువులో చేపలకోసం ఆహారంగా కోళ్ల వ్యర్థాలు వేస్తున్న విషయం తనదృష్టికి రాలేదని తిర్లంగి సచివాలయ కార్యదర్శి సింహాచలం తెలిపారు.