CM Meeting: జిల్లాలో కెమికల్ ఇంజనీర్లకు డిమాండ్
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:54 PM
Chemical engineers జిల్లాలో కెమికల్ ఇంజనీర్లకు విపరీతమైన డిమాండ్ ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతన్న కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. జిల్లా ప్రగతికి సంబంధించి.. యాక్షన్‌ప్లాన్‌ను.. జిల్లాను ఏవిధంగా అభివృద్ధి చేస్తామన్నదీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు.

తలసరి ఆదాయం పెంచేందుకు చర్యలు
ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఏఐ టూల్స్‌పై శిక్షణ
సీఎంకు వివరించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
జిల్లా ఇన్‌చార్జి మంత్రికి చంద్రబాబు చిన్నపాటి క్లాస్
శ్రీకాకుళం, మార్చి 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కెమికల్ ఇంజనీర్లకు విపరీతమైన డిమాండ్ ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతన్న కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. జిల్లా ప్రగతికి సంబంధించి.. యాక్షన్‌ప్లాన్‌ను.. జిల్లాను ఏవిధంగా అభివృద్ధి చేస్తామన్నదీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ‘ఫార్మా రంగంలో జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఫార్మా సంస్థల నుంచి కెమికల్ ఇంజనీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. పాలిటెక్నిక్ కళాశాలలో ఇప్పటికే కెమికల్ ఇంజనీరింగ్‌లో డిప్లమో కోర్సులు ప్రారంభించాం. జిల్లా ప్రజల తలసరి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది తలసరి ఆదాయం రూ.1.85లక్షలు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించాం. జిల్లాలో రైతులు కేవలం వరి మాత్రమే ప్రధానంగా సాగు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలను కూడా ప్రోత్సహించనున్నాం. వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగంలో జిల్లాలో ప్రగతి సాధించడానికి ఉన్న అవకాశాలను వినియోగించుకోబోతున్నాం. అరసవల్లి, శ్రీకూర్మం క్షేత్రాలతోపాటు పర్యాటక పరంగా జిల్లాను అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ‘ఏ.ఐ’(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టూల్స్ వినియోగంపై ప్రత్యేకంగా శిక్షణ నిర్వహిస్తున్నాం. ప్రతి మూడు మాసాలకు ఒకసారి 200 మంది ఉద్యోగులకు ఈ శిక్షణ అందిస్తామ’ని స్పష్టం చేశారు.
‘తలసరి’ ఎందుకు తగ్గుతోంది?
శ్రీకాకుళం జిల్లా ప్రజల తలసరి ఆదాయం ఎందుకు తగ్గుతోందంటూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు సీఎం చంద్రబాబునాయుడు చిన్నపాటి క్లాస్ పీకారు. ‘‘తలసరి ఆదాయంలో శ్రీకాకుళం వెనుకబడిపోయింది. ఈ సమస్య ఎందుకొచ్చింది. సులభమైనవాటి గురించి మాట్లాడి వెళ్లిపోతే సమస్యలు పరిష్కారం కావు. జిల్లాస్థాయిలో చర్చించకుండా ఇక్కడ ఈజీ సొల్యూషన్స్ చెబితే ఫలితాలు రావు. ఇన్ని రోజుల నుంచి ఏమి చేశారు. ఎవరితో మాట్లాడారు?’’ అంటూ మంత్రి శ్రీనివాస్‌ను సీఎం ప్రశ్నించారు.
అమ్మా నీ హామీలు నాకు వద్దు
సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ ‘తోటపల్లి రిజర్వాయర్ పూర్తి చేయాలి. జీఎస్డీపీలో జిల్లా నుంచి రాష్ట్రానికి కాంట్రిబ్యూషన్ ఇస్తామని సీఎంకి హామీ ఇస్తున్నాను’ అని వెల్లడించారు. ఈవిషయమై ముఖ్యమంత్రి కలుగజేసుకుని.. ‘‘అమ్మా నీ హామీలు నాకు వద్దు. ఏదైనా ఉంటే చేతల్లో చూపించు. మాటలు వద్దు. ఇది మీ పనితీరు అని రిపోర్ట్ చెబుతోంది. నాకంతా ‘రా’ మెటీరియల్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరినీ ఎక్స్‌రే చేయగలగాలి. మీ సలహాలు వద్దు. తొమ్మిది నెలలు గడిచిపోయింది. మీ ప్రోగ్రెస్ లెక్కలు ఇక్కడ ఉన్నాయి’’ అంటూ ముఖ్యమంత్రి పేర్కొన్నారు.