ఆదిత్యాలయంలో భక్తుడి పర్సు మాయం
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:37 AM
సూర్యనారాయ ణ స్వామి ఆ యంలో ఆదివా రం ఓ భక్తుడి పర్సు మాయ మైంది.

ప్రసాదాల కౌంటర్ వద్ద చోరీకి గురైన వైనం
కనిపించని సెక్యూరిటీ సిబ్బంది
అరసవల్లి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): సూర్యనారాయ ణ స్వామి ఆ యంలో ఆదివా రం ఓ భక్తుడి పర్సు మాయ మైంది. సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతోనే తన పర్సును జేబుదొంగ కొట్టేసినట్లు ఆయన వాపోతున్నాడు. సంతబొమ్మాళి మండలం సీతానగరం గ్రామానికి చెందిన బచ్చల తాతారావు తన కుటుంబంతో కలిసి ఆదిత్య ని దర్శించుకున్నాడు. అనంతరం ప్రసాదాల కౌంటర్ వద్దకు వెళ్లి ప్రసాదం కొనుగోలు చేసి బయటకు వచ్చి చూడగా.. నగదుతో ఉన్న తన పర్సు మాయమైనట్టు గుర్తించాడు. దీనిపై ఆలయ అధి కారులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశాడు. కొంతసేపటి తరువాత పర్సు ఖాళీగా వేరేచోట దర్శనమిచ్చింది. ఆలయ సిబ్బంది దానిని తాతారా వుకు అందజేశారు. కాగా, ప్రసాదాల కౌంటర్ వద్ద ఆదివారం ప్రత్యే కంగా ఇద్దరు లేదా ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చే యాల్సి ఉంది. కానీ, ఒక్కరు కూడా అక్కడ కనిపించలేదు. దీంతో కౌంటర్ వద్ద భక్తులు పెద్ద ఎత్తున గుమిగూడడంతో తాతారావు ప ర్సు అపహరణకు గురైంది. అదే సెక్యూరిటీ సిబ్బంది అక్కడ ఉం డుంటే భక్తులు సక్రమంగా క్యూలైన్‌లో నిలబడి ప్రసాదాలు కొనుగో లు చేసేవారని, అప్పుడు తన పర్సు దొంగతానికి గురయ్యేది కాదని తాతారావు అంటున్నాడు. రూ.కోట్ల ఆదాయం వస్తున్న ఆలయంలో సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణమని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.