ఆప్కాస్‌ను రద్దు చేయవద్దు
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:56 PM
ఆప్కాస్‌ను రద్దు చేయవద్దని, కార్మికులను పర్మినెంట్ చేయాలని మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు కోరారు. మంగళవారం జిల్లాలోని శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో కార్మికులు ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు.

ఆప్కాస్‌ను రద్దు చేయవద్దని, కార్మికులను పర్మినెంట్ చేయాలని మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు కోరారు. మంగళవారం జిల్లాలోని శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో కార్మికులు ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు.
ఫఅరసవల్లి, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): మునిసిపల్ కార్మికులను ప్రైవేటు ఏజె న్సీలకు అప్పగించే చర్యలను ప్రభుత్వం వెంటనే ఆపాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, నగర కన్వీనర్ ఆర్.ప్రకాష్, ఏపీ మున్సిపల్ వర్కర్క్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఏడురోడ్ల కూడలి నుంచి మునిసిపల్ కార్పొ రేషన్ కార్యాలయంవరకు కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులను పర్మినెంట్ చేయా లని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మునిసిపల్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కె.రాజు, రాము, గురుస్వామి, ఏ.శేఖర్, జె.మాధవి,శంకర్ గణేష్ పాల్గొన్నారు.
ఫఆమదాలవలస, ఏప్రిల్1(ఆంధ్రజ్యోతి):ఏజెన్సీలకు అప్పగించి తమ జీవితాల ను నాశనంచేయవదని మునిసిపల్‌యూనియన్ నాయకుడు తాడిసంతోష్ డి మాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని పాలపోలమ్మ ఆలయం దగ్గర నుంచి వన్‌వే జంక్షన్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వరకు మునిసిపల్ కార్మికులు ఆప్కాస్‌ను రద్దును నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని టీడీపీ కార్యాల యంలో ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు పీవీవీకే రాజు, తమ్మినేని శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. కార్య క్రమంలో మునిసిపల్ కార్మికులు ఎన్.రాజేష్, ఎ.శ్రీనివాస్, కె.తారక, జె.శ్రీను, కె.ఈశ్వరరావు, డి.రాజేష్ పాల్గొన్నారు.
ఫఇచ్ఛాపురం, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): ఏపీసీఓఎస్ రద్దు చేస్తే మునిసిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని మునిసిపల్ పారిశుధ్య కార్మికులు డిమాండ్ చేశారు. ఇచ్ఛాపురం మునిసిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈసంద ర్భంగా మాట్లాడుతూ ఏపీసీఓఎస్ రద్దు నిర్ణయం ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇచ్ఛాపురం శాఖ ప్రతినిధులు రమేష్‌పట్నాయక్, మంగళసత్తు, గోంగాదర్ రాధో, లక్ష్మణరావు, ఢిల్లీ పాల్గొన్నారు.