Share News

రీసర్వేతో రైతులకు ప్రయోజనం

ABN , Publish Date - Apr 03 , 2025 | 11:39 PM

: భూముల రీసర్వేతో రైతులకు ప్రయో జనం చేకూరుతుందని తహసీల్దార్‌ పెద్దింటి సోమేశ్వరరావు తెలిపారు. గురువారం మండలం శివరాంపురం పంచాయతీ మొజ్జువాడలో రీసర్వేపై అవగాహన ర్యాలీ, గ్రామసభ నిర్వహించారు.

     రీసర్వేతో రైతులకు ప్రయోజనం
అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు

నందిగాం, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): భూముల రీసర్వేతో రైతులకు ప్రయో జనం చేకూరుతుందని తహసీల్దార్‌ పెద్దింటి సోమేశ్వరరావు తెలిపారు. గురువారం మండలం శివరాంపురం పంచాయతీ మొజ్జువాడలో రీసర్వేపై అవగాహన ర్యాలీ, గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రైతు సర్వేకు అందుబాటులో ఉండి తమ వివరాలు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో డీటీ ఆర్‌.రామారావు, మండల సర్వేయర్‌ హనుమంతరావు, సర్పంచ్‌ ఎస్‌.జానకిరాం, వీఆర్‌వో ఎం.మురళీరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 11:39 PM