గోళ్లు పెంచిందని కుమార్తెను చితకబాదిన తండ్రి
ABN , Publish Date - Mar 15 , 2025 | 12:03 AM
మేజర్ పంచాయతీ టెక్కలి పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలిక తన చేతికి గోళ్లు పెంచింద

టెక్కలి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): మేజర్ పంచాయతీ టెక్కలి పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలిక తన చేతికి గోళ్లు పెంచిందన్న కోపంతో తండ్రి చితకబాదిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఆ వీధివాసుల సాయంతో గాయపడిన ఆ బాలిక చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి వచ్చింది. వైద్యులు సూర్యారావు పరిశీలించి అవసరమైన మందులు అందజేశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ బాలిక శనివారం చివరి పరీక్ష రాయాల్సి ఉంది. మూడేళ్ల కిందట తల్లి చనిపోయింది. తండ్రి మద్యం తాగి తనను కొడుతున్నాడని కన్నీరుమున్నీరుగా విలపించింది. పోలీసులకు ఫిర్యా దు చేసినట్టు ఆ బాలిక తెలిపింది. ఈ విషయమై పోలీసులను సంప్ర దించగా.. ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.