29న టీడీపీ జెండా ఎగురవేయండి
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:49 PM
టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఈనెల 29న నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు, పంచాయతీల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు.

అరసవల్లి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఈనెల 29న నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు, పంచాయతీల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. సోమవారం శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులోగల టీడీపీ జిల్లా పార్టీ కా ర్యాలయంలో నియోజకవర్గ నాయకులతో విస్తృత స్థాయి సమా వేశం జరిగింది.ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రతి 60 మందికి ఇద్దరు చొప్పున కుటుంబ సాధికార సమితులను ఏర్పాటు చే యాలని, డివిజన్ ఇన్‌చార్జిలు, నాయకులను కోరారు. బుధవా రం స్థానిక ఏడురోడ్ల జంక్షన్ వద్ద నిర్వహించనున్న మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడి జన్మదిన వేడుకలను విజయవంతం చేయా లని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజేబాబు, నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, అరవల రవీంద్ర, సింతు సుధాకర్, కొర్ను నాగార్జున ప్రతాప్, చిట్టి నాగభూషణరావు, లోపింటి రాధాకృష్ణ, కోరాడ వెంకటరావు, సీర రమణయ్య, ఇప్పిలి తిరుమలరావు, కవ్వాడి సుశీల పాల్గొన్నారు.
శిక్షణతో నైపుణ్యం పెంపొందించుకోవాలి
విద్యార్థులు తమ నైపుణ్యాలను శిక్షణతో పెంపొందించుకొని జీవితంలో అభివృద్ధి సాధించా లని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. సోమవారం శ్రీకాకుళంలోని బలగలో గల డీఎల్‌టీసీ, ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు.