ప్రజారోగ్యానికి పెద్దపీట
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:22 PM
ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ తెలిపారు.

కంచిలి, మార్చి 28 (ఆంఽధ్రజ్యోతి): ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ తెలిపారు. కంచిలి మండలంలోని మండపల్లి గ్రామానికి చెందిన దిక్కల కేశవరావు అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్ నుంచి మంజూరైన రూ.1,00457లు చెక్కుకు సంబంధించిన ఆర్డర్ కాపీని అశోక్ కవిటి మండలంలోని రామయ్యపుట్టుగలోగల తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం బాసటగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో నాయకులు మాదిన రామారావు,సంపతరావు, మాదిన ప్రదీప్ పాల్గొన్నారు.
డీఈవోపై చర్యలు తీసుకోవాలి
కవిటి,మార్చి28(ఆంధ్రజ్యోతి):డీఈవోపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక సభ్యులు కోరారు. రామయ్యపుట్టుగలో ప్రభుత్వ విప్ బి.అశోక్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయుల అక్రమసస్పెన్షన్‌లను రద్దుచేసి వారిపై క్రిమినల్ కేసులు ఉపసంహరించాలని కోరారు.