Road Accident వివాహమైన 50 రోజులకే...
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:54 PM
Road Accident వివాహమైన 50 రోజులకే ఓ పెళ్లి కుమారుడు రోడ్డు ప్రమాదా నికి గురై మృత్యువాత పడిన ఘటన తీవ్ర సంచ లనం కలిగించింది.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పలాస, మార్చి 26(ఆంధ్రజ్యోతి): వివాహమైన 50 రోజులకే ఓ పెళ్లి కుమారుడు రోడ్డు ప్రమాదా నికి గురై మృత్యువాత పడిన ఘటన తీవ్ర సంచ లనం కలిగించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పలాస మండలం గొల్లమా కన్నపల్లికి చెందిన కోరాడ మధు(28) ద్విచక్ర వాహనంపై వెళుతూ కోసంగిపురం ఫ్లై ఓవర్ వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళ వారం రాత్రి ఈ ఘటన జరగ్గా అర్ధరాత్రి కాశీబుగ్గ పోలీసులకు సమాచారం రావడంతో మృతదే హాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సింగుపురానికి చెందిన కుమారిని ప్రేమించి ఫిబ్రవరి 6న వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో పలాసలో పనిమీద వచ్చి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వివాహం ఆనందం తీరక ముం దే మధు మృత్యువాత పడడంతో వారి ఇంటిలో తీవ్ర విషాద ఛాయలు అల ముకున్నాయి. సీఐ సూర్యనారాయణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి..
ఎచ్చెర్ల, మార్చి 26(ఆంధ్రజ్యోతి): అరిణాం అక్కివలస జంక్షన్ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇదే పంచా యతీ బారికిపేట గ్రామానికి చెందిన సవలాపురపు లక్ష్మణరావు (52) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మణరావు భార్యాబిడ్డలతో కలిసి గత 15 ఏళ్ల నుంచి రాజాంలో ఉంటున్నారు. బుధవారం ఉదయం లావేరు మండలం అదపాక గ్రామంలోని తన బంధువుల ఇంటికి వచ్చిన లక్ష్మణరావు తిరిగి వెళ్లే క్రమంలో అరిణాం అక్కివలస జంక్షన్‌లో దిగి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందాడు. లక్ష్మణరావుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకా కుళం సర్వజనాసుపత్రికి తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుండెపోటుతో బడివానిపేట వీఆర్వో..
ఎచ్చెర్ల, మార్చి 26(ఆంధ్రజ్యోతి): బడివానిపేట గ్రామ సచివాలయం వీఆ ర్వో పుట్టా రాజారావు(45) బుధవారం విధి నిర్వహణలో ఉండగానే గుండె పోటుతో మృతిచెందారు. ఉదయం 10 గంటల సమ యంలో విధులకు హాజరైన రాజారావు.. సాయంత్రం 4 గంటల సమయంలో గుండెపోటుతో ఒక్క సారిగా కుప్పకూలి పోయారు. చిలకపాలెం గ్రామానికి చెందిన రాజారావు వీఆర్‌ఏగా పనిచేస్తూ.. ఏడాది కిందట పదోన్నతిపై వీఆర్వో బడివానిపేటలో పని చేస్తున్నారు. ఈయనకు భార్య రజని, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృత దేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. భార్య రజని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీఆర్వో మృతిపట్ల తహసీల్దార్ బి.గోపాలరావు, రెవెన్యూ సిబ్బంది సంతాపం వ్యక్తంచేశారు.
చికిత్స పొందుతూ ఆర్మీ జవాన్..
టెక్కలి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్ప టెక్కలి మేజర్‌పంచాయతీ చేరి వీధికి చెందిన ఆర్మీ జవాన్‌పైల ప్రతాప్‌రెడ్డి (38) మృతి చెందినట్లు కుటుం బసభ్యులు తెలిపారు. ప్రతాప్ రెడ్డి మూడురోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడి అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రతాప్‌రెడ్డి మృతదేహాన్ని ఢిల్లీ నుంచి ఆర్మీ జవాన్లు స్వగ్రామమైన టెక్కలి తీసుకు రానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.