Share News

‘వంశధార‘ను ఆధునికీకరించండి

ABN , Publish Date - Mar 20 , 2025 | 11:47 PM

వంశధార కాలువలను ఆధునీకరించాలని పలాస, నరసన్నపేట, పాతపట్నం, శ్రీకాకుళం ఎమ్మెల్యేలు గౌతు శిరీష, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, గొండు శంకర్‌ కోరారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీలో జిల్లాలో సాగునీటి సమస్యలపై ప్రస్తావించారు. టెక్కలి, పలాస నియోజకవర్గాల్లో ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

‘వంశధార‘ను ఆధునికీకరించండి
ముఖ్యమంత్రికి సమస్యను వివరిస్తున్న గొండు శంకర్‌:

వంశధార కాలువలను ఆధునీకరించాలని పలాస, నరసన్నపేట, పాతపట్నం, శ్రీకాకుళం ఎమ్మెల్యేలు గౌతు శిరీష, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, గొండు శంకర్‌ కోరారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీలో జిల్లాలో సాగునీటి సమస్యలపై ప్రస్తావించారు. టెక్కలి, పలాస నియోజకవర్గాల్లో ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

చంద్రబాబుతోనే శివారు ఆయకట్టుకు నీరు

పలాస, మార్చి 20(ఆంధ్రజ్యోతి): వంశధార కాలువ ఆధునీకరించి ఆయకట్టుకు సాగునీరందించాలని పలాస ఎమ్మెలే ్య గౌతు శిరీష కోరారు. గురువారం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ వంశధార వైసీపీ పాల నలో నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. జిల్లాలో ఇద్ద రు మంత్రులు, స్పీకర్‌ ఉన్నా వంశధారను పట్టించుకో లేదని, కనీసం కాలువ ఆధునీకరించి నీరందిస్తామన్న ధ్యాసే లేదని విమర్శించారు. పలాస నియోజకవర్గం నుంచి ఎన్నికైన వ్యక్తే మంత్రిగా వ్యవహరించినా వంశ ధారపై నిర్లక్ష్యం వహించారని, ఐదేళ్లు నీరు లేక రైతు లకు ఇబ్బందులుపడ్డారన్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శివారు భూములకు నీరందించినట్లు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న వంశధార ఎడమ కాలువను ఆధునీకరిస్తే పూర్తి స్థాయి నీరు శివారుభూముల వరకూ అందుతుందన్నారు.గతంలో కాలువ ఆధు నీకరణ చేసిన కాంట్రాక్టర్లకు ఇంతవరకూ బిల్లులు కూడా ఇంకా అందించలేదని, దీనిపై ప్రభుత్వం శ్రద్ధ వహించాలని కోరారు. కాలువను ఆధునీకరిస్తే వంశ ధార ఎడమకాలువపై ఆధారపడిన 12 మండలాలు, నాలుగు నియోజకవర్గాల రైతులకు సాగు నీరందించవచ్చని తెలిపారు.

కుంభకోణంపై దర్యాప్తు పూర్తి చేయాలి

నరసన్నపేట, మార్చి 20(ఆంధ్రజ్యోతి): వంశధార ఆధునీకరణకు 2019లో డీపీఆర్‌ తయారుచేసినా, గతప్రభుత్వం నిర్లక్ష్యంతో మురుగున పడిందని బగ్గు రమణమూర్తి ఆరోపించారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ టెక్కలి, పలాస నియోజవర్గాలకు సాగునీరు అందడం లేదని, వంశధార ఎడమ కాలువ పరిధిలో 1.64 లక్షలు ఎకరాలు ఉంటే, నరసన్నపేట నియోజవర్గంలో 74 వేల ఎకరాలు సాగుభూమి ఉందని తెలిపారు. నది చెంతనా ఉన్నా కాలువ ద్వారా సాగునీరు అందడం లేదన్నారు. షట్లర్లు కుంభకోణం వల్ల కాలువలకు షట్టర్లు అమర్చలేక నీరు వృథాగా పోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. కుంభకోణంపై దర్యాప్తు పూర్తి చేయా లని, మిగిలి ఉన్న షటర్లు తుప్పు పట్టకుండా ఏర్పాటు చేయాలని కోరారు.

కాలువల్లో పూడికలు తీయాలి

పాతపట్నం, మార్చి20 (ఆంధ్రజ్యోతి): వంశధార కుడి, ఎడమ కాలువల్లో పూడికతీతలు చేపట్టి ఆధు నికీకరించాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు.అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కనీసస్థాయిలో మరమ్మ తులు జరగకపోవడంతో నిర్దేశిత ఆయకట్టుకు నీరం దడంలేదని తెలిపారు. అవసరమైనచోట లిఫ్ట్‌ ఇరి గేషన్‌ స్కీములు మంజూరు చేయాలని కోరారు. ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ కాలువలకు 100 ఎంఎం సీసీ లైనింగ్‌ ఏర్పాటుచేస్తే జిల్లా వ్యాప్తంగా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందుతుందని తెలిపారు.

పెండింగ్‌ పనులను పూర్తిచేయాలి

అరసవల్లి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నియోజకవర్గంలో పెండిం గ్‌లో ఉన్న సాగునీటి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ కోరారు. గురువారం ఆయన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. నియోజ కవర్గం పరిధిలో 30వేల ఎకరాలు శివారుఆయకట్టు భూములు ఉన్నాయ ని తెలిపారు. వీటి పరిధిలో చాలా వరకు పనులు పెండింగ్‌లో ఉండి పోయాయని చెప్పారు. వత్సవలస లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనుల కోసం ప్రపోజల్‌ చేసి నట్లు తెలిపారు. కళింగపట్నం ఎత్తిపో తల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని వాటిని వెంటనే పూర్తి చేయాలని కోరారు. రూ.175 కోట్లతో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు మంజూరైనా గత ప్రభుత్వం ఐదు శాతం కూడా చేయలేదని ఆరోపించారు. వాటి పూర్తికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రిని కోరారు. శ్రీకాకుళం పట్టణంలో 1500 కుటుంబాలు తమ ఇంటికి విద్యుత్తు, ఇంటి పన్నులు కడుతున్నారని, వాటిని రెగ్యులర్‌చేయాలని, కంపోస్టు కాలనీలో 200 కుటుం బాలు ఉన్నాయని, వాటిని రెగ్యులర్‌ చేయాలని కోరారు. అలాగే కళింగ పట్నం వద్ద జెట్టీ నిర్మాణానికి కేంద్రం రూ.10కోట్లు మంజూరు చేస్తే గత వైసీపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని, దీనికి సంబం ధించి కేంద్రానికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఎమ్మెల్యే శంకర్‌ కోరారు. దీనిపై స్పందించిన చంద్రబాబు వెంటనే కేంద్రా నికి లేఖ రాయాలని సీఎస్‌ రవిచంద్రను ఆదేశించారు.

Updated Date - Mar 20 , 2025 | 11:47 PM