పవర్‌ప్లాంట్ ప్రతిపాదనలు విరమించుకోవాలి
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:38 PM
థర్మల్ పవర్‌ప్లాంట్ వల్ల మానవాళి మనుగడకే ప్రమాదమని, ఈ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

ఆమదాలవలస, మార్చి 27(ఆంధ్రజ్యోతి): థర్మల్ పవర్‌ప్లాంట్ వల్ల మానవాళి మనుగడకే ప్రమాదమని, ఈ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం వెన్నెలవలస, మశానపుట్టి, జంగాలపాడు గ్రామాల్లో ప్రజా సంఘాల నాయకులు పర్యటించారు. ఆదివాసీలు చేస్తున్న పోడు వ్యవసా యాన్ని వెన్నెలవలస రిజర్వాయర్‌ను పరిశీలించారు. అనంతరం వెన్నెవల సలో పోరాట కమిటీ నాయకులు సవర సింహాచలం అధ్యక్షతన జరిగిన సభలో పౌర హక్కుల సంఘ జిల్లా అధ్యక్షుడు పి.దానేష్, కేఎన్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య, పీడీఎం రాష్ట్ర నాయకులు పాలిన వీరా స్వామి, పీకేఎస్ జిల్లా అధ్యక్షుడు ధర్మారావు పాల్గొని మాట్లాడారు. ఎమ్మె ల్యే కూన రవికుమార్ తన స్వప్రయోజనాల కోసం ఈ ప్రాంత విఽధ్వాం సాన్ని కోరుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పీకేఎస్ జిల్లా కార్యదర్శి పుచ్చ దుర్యోదన, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, రాష్ట్ర కమిటీ సభ్యులు వంకల మాధవరావు తదితరులు పాల్గొన్నారు.