ఎక్సైజ్ అధికారుల నుంచి రక్షణ కల్పించాలి
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:40 PM
: తమకు ఎక్సైజ్ అధికారులు వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని మందస వర్తక సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు గురు వారం మందసలో డీటీ రామకృష్ణకు ఆ సంఘం అధ్యక్షుడు వడ్డి గోపాల కృష్ణ ఆధ్వ ర్యంలో వ్యాపారులు వినతిపత్రం అందజేశారు.

హరిపురం ఏప్రిల్3 (ఆంధ్రజ్యోతి): తమకు ఎక్సైజ్ అధికారులు వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని మందస వర్తక సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు గురు వారం మందసలో డీటీ రామకృష్ణకు ఆ సంఘం అధ్యక్షుడు వడ్డి గోపాల కృష్ణ ఆధ్వ ర్యంలో వ్యాపారులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సారాతయారీకిఅవసరమైన గిరిజనులకు నల్లబెల్లం విక్రయిస్తున్నామని వేధింపుల కు గురిచేస్తున్నారని వాపోయారు. దుకాణాలు తనిఖీ చేసి విక్రయిస్తే చర్యలు తీసు కోవాలని సూచించినా పట్టించుకోవడంలేదని వాపోయారు.పలాస, సోంపేట పోలీస్ స్టేషన్లకు పిలిపించి ఖాళీపేపర్లపై సంతాకాలు చేయించి కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని భాయందోళన వ్యక్తం చేశారు.ఇలాగే కొన సాగితే తామంతా వ్యాపారాలు మూసి వలసలే శరణ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మట్ట ధర్మారావు, కె.నరేష్, కె.మహేష్, శ్రవణ్, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.