Ramjan: భక్తిశ్రద్ధలతో రంజాన్
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:21 PM
Devotion Celebrations రంజాన్ పర్వదినం వేళ.. జిల్లావ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకున్నారు. మసీదుల్లో నమాజ్‌లు చేసి.. ఆత్మీయ ఆలింగనంతో శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

శ్రీకాకుళం కల్చరల్, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రంజాన్ పర్వదినం వేళ.. జిల్లావ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకున్నారు. మసీదుల్లో నమాజ్‌లు చేసి.. ఆత్మీయ ఆలింగనంతో శుభాకాంక్షలు చెప్పుకున్నారు. శ్రీకాకుళంలోని జామియా మసీదులో మత పెద్ద ఇమామ్ వహబ్ ఆధ్వర్యంలో నమాజ్‌లు నిర్వహించగా అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. పితృదేవతలున్న సమాధుల వద్ద నివాళి అర్పించారు. రంజాన్ వేడుకల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని మాట్లాడుతూ.. హిందూ ముస్లింలు ఐక్యతతో పండుగలు నిర్వహించుకోవడం ఆనందకరమైన విషయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బహుదూర్ బాషా, నిజాముద్దీన్, షాను, రచయిత ఎస్.మహమ్మద్ రఫీ (ఈ-వేమన), మహిబుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.