Lucjy draw: నేడు ఆంధ్రజ్యోతి.. ‘కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా’
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:02 AM
Car Race draw ఆంధ్రజ్యోతి యాజమాన్యం పాఠకుల కోసం ‘కార్ అండ్ బైక్ రేస్’ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవ పురస్కారం నేపథ్యంలో శ్రీకాకుళం యూనిట్(శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం)స్థాయిలో విజేతల ఎంపిక కోసం మంగళవారం లక్కీ డ్రా తీయనుంది.

ఎచ్చెర్ల ఆంధ్రజ్యోతి యూనిట్ ఆఫీస్‌లో ఉదయం 11.30 గంటలకు..
హాజరుకానున్న ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ఆంధ్రజ్యోతి యాజమాన్యం పాఠకుల కోసం ‘కార్ అండ్ బైక్ రేస్’ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవ పురస్కారం నేపథ్యంలో శ్రీకాకుళం యూనిట్(శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం)స్థాయిలో విజేతల ఎంపిక కోసం మంగళవారం లక్కీ డ్రా తీయనుంది. ఎచ్చెర్లలోని యూనిట్ కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. లక్కీ డ్రా ద్వారా ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలతోపాటు వందమంది ప్రోత్సాహక బహుమతుల కోసం విజేతలను ఎంపిక చేస్తారు. గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ప్రతి నెలా మూడు చొప్పున నాలుగు నెలలకు 12 కూపన్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ప్రచురించారు. ఒక్కో నెల కూపన్లు ఒక సెట్టుగా.. నాలుగు నెలలకు నాలుగు సెట్ల కూపన్లను ‘ఆంధ్రజ్యోతి’ యూనిట్ కార్యాలయానికి మూడు జిల్లాల నుంచి వేలాది మంది పాఠకులు కూపన్లు పంపించారు. లక్కీ డ్రా ద్వారా ఉమ్మడి జిల్లాలో మొదటి బహుమతి బైక్, ద్వితీయ బహుమతి రిఫ్రిజరేటర్, తృతీయ బహుమతి కలర్ టీవీ, వంద మందికి కన్సొలేషన్ బహుమతులు ఇస్తారు. అలాగే త్వరలో నిర్వహించే రాష్ట్రస్థాయి లక్కీడ్రాలో బంపర్ బహుమతిగా కారు గెలుచుకునే అవకాశం ఉంది.