మునిసిపాలిటీ అభివృద్ధే ధ్యేయం: ఎమ్మెల్యే
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:36 PM
:పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ అభివృద్ధే ధ్యేయమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.గురువారం మునిసిపాలిటీ పరిధిలోని శాంతి నగర్, తాళభద్ర, రాజంకాలనీ, పెద్దబ్రాహ్మణ వీధి, నీలాపురం, నర్సిపురం తదితర ప్రాం తాల్లో సీసీరోడ్లు, మురుగు కాలువలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

కాశీబుగ్గ,ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి):పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ అభివృద్ధే ధ్యేయమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.గురువారం మునిసిపాలిటీ పరిధిలోని శాంతి నగర్, తాళభద్ర, రాజంకాలనీ, పెద్దబ్రాహ్మణ వీధి, నీలాపురం, నర్సిపురం తదితర ప్రాం తాల్లో సీసీరోడ్లు, మురుగు కాలువలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే కాశీబు గ్గ న్యూకాలనీలో మునిసిపల్ సాధారణ నిధులు రూ.20లక్షలతో నీటి ట్యాంకులను ప్రా రంభించారు.కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, కమిషనర్ రామారావు, ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, లొడగల కామేశ్వరరావు యాదవ్, గాలి కృష్ణారావు, సూర్యనారాయణ, దువ్వాడ శ్రీకాంత్, రామకృష్ణ, సత్యం,తిరుమలరావు పాల్గొన్నారు.
ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం
పలాస,ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి):ఆటోకార్మికుల సమస్యలను మంత్రి అచ్చెన్నాయుడుతో మాట్లాడి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. గురువారం ఆటో కార్మికుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కార్మికసంఘ నాయకులు మాట్లాడుతూ ఎచ్చెర్ల వెళ్లి ఫిటినెస్ పరీక్షలు చేయించుకోవాలం టే 200 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. కార్యక్రమంలో ఆటో కార్మికసంఘ గౌరవాధ్యక్షుడు దువ్వాడ శ్రీకాంత్, సంఘ అధ్యక్షుడు గోపి పాల్గొన్నారు.
ఊయల పథకం ప్రారంభం
పలాస ప్రభుత్వాసుపత్రిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పసిపిల్లల ఊయల పథకాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ అంగవైక ల్యంతో జన్మించిన పిల్లలను అనేక ప్రాంతాల్లో ముళ్ల పొదలు, చెరువు గట్లు, కాలువల్లో విడిచివారి జీవితాలను నాశనం చేస్తున్నారని, అటువంటి వారికోసం ప్రభుత్వ ఆసుపత్రు ల్లో ఊయల ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో పీఓ పార్వతి, సూపర్‌వైజర్లు సునీత, లత, గంగమ్మ, సర స్వతి, ధనలక్ష్మి పాల్గొన్నారు.