న్యాయవాదులు విధుల బహిష్కరణ
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:25 AM
స్థానిక జూ నియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయవాదు లు బుధవారం వి ధులు బహిష్కరిం చారు.

ఆమదాలవలస, మార్చి 26(ఆంధ్రజ్యోతి): స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయవాదు లు బుధవారం వి ధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కణితి విజయలక్ష్మీభాయ్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ మారుతీనగర్ ప్రాంతానికి చెందిన న్యాయవాదిని అతి దారుణంగా దస్తగిరి అనే వ్యక్తి కత్తులతో దాడి చేసి హత్యచేయ డాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ హత్యకు నిరసనగా ఒక రోజు కోర్టు విధులను బహిష్కరిస్తూ కోర్టు ఆవర ణలో నిరసన చేపట్టారు. న్యాయవాదులు పీవీ నరసింహం, సాధు ధనుంజయరావు, తమ్మినేని అన్నమనాయుడు, వాడవలస రాజేశ్వరరావు, సనపల ప్రసాద్, గరుగుపల్లి వెంకటరావు పాల్గొన్నారు.