Share News

ఈ సారైనా కఠిన చర్యలుంటాయా?

ABN , Publish Date - Mar 30 , 2025 | 12:01 AM

ముక్తింపురం కొండ ప్రాంతాన్ని శనివారం అధికారులు పరిశీలించారు. ఆంధ్రజ్యోతిలో శనివారం ప్రచురితమైన ‘మాకెవరు అడ్డువచ్చేది’ కథనానికి అధికారులు స్పందించారు.

ఈ సారైనా కఠిన చర్యలుంటాయా?
పరిశీలిస్తున్న మైన్స్‌, రెవెన్యూ సిబ్బంది

  • ముక్తింపురం కొండను పరిశీలించిన అధికారులు

  • ఇంటెలిజెన్స్‌ అధికారుల ఆరా

  • సీఎంవోకు ఫిర్యాదు?

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

రణస్థలం, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ముక్తింపురం కొండ ప్రాంతాన్ని శనివారం అధికారులు పరిశీలించారు. ఆంధ్రజ్యోతిలో శనివారం ప్రచురితమైన ‘మాకెవరు అడ్డువచ్చేది’ కథనానికి అధికారులు స్పందించారు. కొండపై అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలపై ఆంధ్రజ్యోతి సామాజిక బాధ్యతగా కథనాలు ప్రచు రించింది. అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. వాటి ని సైతం అక్రమార్కులు తొలగించి తమ పనికానిచ్చేస్తున్నారు. వందలాది లోడ్ల గ్రావెల్‌ తవ్వించి కొండను గుల్ల చేస్తున్నారు. ఈ తరుణంలో మరోసారి ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. దీంతో మైన్స్‌, రెవెన్యూ అధికారులు శని వారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. నివే దిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించనున్నట్టు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ఇంటె లిజెన్స్‌ అధికారులు ఆరాతీశారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యా యానికి సైతం ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. గతంలో మాదిరిగా వది లేస్తారా? లేదా? కఠిన చర్యలు తీసుకుంటారో చూడాలి.

Updated Date - Mar 30 , 2025 | 12:01 AM