Works పనులు వేగవంతం చేయాలి: ఆర్డీవో
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:51 PM
Works ఉద్దానం ఫేజ్-2 పనులు వేగవంతం చేయాలని టెక్కలి ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి ఆదేశించారు.

పాతపట్నం, మార్చి 26(ఆంధ్ర జ్యోతి): ఉద్దానం ఫేజ్-2 పనులు వేగవంతం చేయాలని టెక్కలి ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి ఆదేశించారు. బోరుభద్ర, కొరసవాడ, కాగువాడలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిమిత్తం కొరసవాడ, బోరుభద్ర పరిధిలో నాలుగు ఎకరాల భూ సేకరణ చేపట్టాలని తహసీల్దార్ ఎస్.కిరణ్ కుమార్‌కు ఆదేశిం చారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ ఆశాలత, ఎంపీడీవో పి.చంద్రకుమారి పాల్గొన్నారు.
సమస్య రాకుండా ప్రహరీ నిర్మించండి
మెళియాపుట్టి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఉద్దానం ప్రాజెక్టుకు, ఏకలవ్య పాఠశాలకు భూ వివాదం రాకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టాలని టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం ఏకలవ్య, ఉద్దానం ప్రాజెక్టకు సంబంధించి సమస్య ఉన్న స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి.పాపారావు తదితరులున్నారు.