-
-
Home » Andhra Pradesh » Today Breaking News AP Assembly Live Updates and Delhi Assembly Updates In Telugu Live Updates Tuesday 25th February 2025 Amar
-

Breaking News: అమలాపురంలో దారుణం..
ABN , First Publish Date - Feb 25 , 2025 | 09:25 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-02-25T18:30:49+05:30
స్కూల్‌లో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత..
అంబేద్కర్ కోనసీమ జిల్లా: జగ్గరరాజుపేట ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 14 పిల్లలకు అస్వస్థత అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం జగ్గరాజు పేట ప్రాథమిక పాఠశాలలో 14 మంది విద్యార్థులకు అస్వస్థత.
ఉదయం రాగిజావ, మధ్యాహ్నం భోజనం తరువాత వాంతులతో బాధపడుతున్న విద్యార్థులు.
హుటాహుటిన అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించిన ఉపాధ్యాయులు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు.
కాలం చెల్లిన రాగిపిండితో జావ పెట్టడంతోనే విద్యార్థులకు అస్వస్థత అంటున్న స్థానికులు.
స్కూల్ వద్ద వంటలు వండకుండ కుండా ఉదయాన్నే ఇంటి వద్ద వండి తీసుకువచ్చి పెట్టిన నిర్వహికులు.
24 మంది తినగ 14 మందికి అస్వస్థత.
అమలాపురం ఏరియా ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్న అమలాపురం ఎమ్మెల్యే అయితబత్తుల ఆనందరావు, DEO సలీమ్ బాషా, ఆర్డీవో, మండల ఎంఈఓ.
-
2025-02-25T18:03:22+05:30
త్వరలో మెగా డీఎస్సీ..
త్వరలో మెగా డీఎస్సీ నిర్వహించి 16,384 పోస్టులు భర్తీ.
మే నెలలో తల్లికి వందనం పథకానికి శ్రీకారం.
ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ అమలు చేస్తాం.
ప్రతి రైతుకు రైతు భరోసా అమలు చేస్తాం.
కేంద్రం తదుపరి ఇచ్చే వాయిదాతో రైతు భరోసా ఇస్తాం.
కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు మరో రూ.14 వేలు జతచేసి. మూడు వాయిదాల్లో రైతు భరోసా చెల్లిస్తాం.
మత్స్యకారులను ఆదుకుంటాం.
ఎన్ని కష్టాలు ఉన్నా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నాం.
-
2025-02-25T18:01:18+05:30
పథకాల అమలుపై క్లారిటీ ఇచ్చిన సీఎం..
పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మూసివేశారు.
మేము 204 అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించాం.
హామీల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం.
పెన్షన్లు రూ.4 వేలకు పెంచాం.
దివ్యాంగుల పెన్షన్లు రూ.6 వేలకు పెంచాం.
64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మాది.
వంట గ్యాస్ ఉచితంగా ఇస్తున్నాం.
-
2025-02-25T17:58:41+05:30
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగం..
ఏపీ ఆర్థిక వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
ఏపీ పునర్ నిర్మాణమే మా లక్ష్యం.
డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి.
కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తోంది.
ఊహించిన దానికంటే కేంద్రం ఎక్కువ సాయం చేస్తోంది.
కేంద్రం సాయం చేసి ఉండకపోతే.. మనకు మరిన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి.
ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు.
వెంటిలేటర్‌పై ఉన్న ఏపీని గాడిన పెడుతున్నాం.
-
2025-02-25T17:58:40+05:30
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగం..
గతంలో కౌరవ సభ.. ఇప్పుడు గౌరవ సభ.
అసెంబ్లీ అంటే దేవాలయంతో సమానం.
అసెంబ్లీలో నిన్న ఒక చీకటి రోజు.
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననే వ్యక్తిని.. నా రాజకీయ జీవితంలో చూడటం ఇదే తొలిసారి.
ప్రతిపక్ష హోదా డిమాండ్ ఏ విధంగా సబబు ప్రజలు ఆలోచించాలి.
ప్రతిపక్ష హోదా మేం ఇచ్చేది కాదు.. ప్రజలు ఇవ్వాలి.
మా స్వార్థ ప్రయోజనాల కోసం మేం కలవలేదు.
రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే కూటమి.
-
2025-02-25T16:55:55+05:30
తల్లికి వందనంపై కీలక ప్రకటన చేసిన సీఎం..
తల్లికి వందనం పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
అసెంబ్లీలో ప్రసంగించిన సీఎం.
తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేస్తాం.
ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా ఈ పథకాన్ని అమలు చేస్తాం.
మే నెలలో ఈ పథకం డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.
రైతు భరోసా చెప్పినట్లుగా చేస్తాం.
-
2025-02-25T16:20:04+05:30
జగన్ పాలనపై ఉపముఖ్యమంత్రి షాకింగ్ కామెంట్స్..
గత ప్రభుత్వం రాజధాని విషయంలో మూడుముక్కలాట ఆడింది.
గత ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు క్షీణించాయి.
ఒకే రోజు 13,326 గ్రామసభలు నిర్వహించి.
ప్రపంచ రికార్డు నెలకొల్పాం.
గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 1800 కి.మీ. మేర సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాం.
మా పాలనలో 6నెలల కాలంలో 4వేల కి.మీ. పైగా సీసీ రోడ్లు వేశాం.
మా ప్రభుత్వ హయాంలో 22వేలకు పైగా గోకులాలు నిర్మించాం.
-
2025-02-25T16:05:22+05:30
AP Assembly: వైసీపీ అంటే గుర్తొచ్చేది ఇదే.. పవన్ మాస్ సెటైర్స్..
అమరావతి: గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు.
గవర్నర్ ప్రసంగానికి జనసేన పార్టీ తరపున, వ్యక్తిగతంగా తన తరపున ధన్యవాదాలు తెలిపిన పవన్.
గతంతో ఇలాంటి సెషన్‌లు ఎప్పుడూ చూడలేదు.. గొడవ ఎలా ఉంటుందో ఇదే తొలిసారి చూడటం.
గతంలో గవర్నర్ ఇఎస్ఎల్ నర్సింహన్ ఉన్నప్పుడు తెలంగాణ అంశంలో ఇలాంటి గొడవ చూసాం.
అసలు ఇలా ప్రవర్తించొచ్చా అని అనిపిస్తోంది.
గవర్నర్ ప్రసంగం జరిగేటప్పుడు డిగ్నిటీని మెయింటెయిన్ చేయాలి అని రూల్ బుక్‌లో రాసి ఉంది.
మనమే ఈ రూల్‌ను బ్రేక్ చేస్తే ప్రజలకు మనం ఏం చెపుతాం.
అసెంబ్లీలో గొడవలు జరిగితే కేసులు ఎందుకు పెట్టరు అని మనోహర్‌ను అడిగాను.
ఇక్కడ సభ్యులపై కేసులు పెట్టడం లేదంటే అన్ని విషయాలు మాట్లడే స్వేచ్చ ఇచ్చినందునే.
నిన్నవారు చేసిన గొడవ గవర్నర్‌పై ఆయన సుప్రీంకోర్టు జస్టిస్‌గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా, కళ్లల్లో చూడగలరా.
నిన్న టీవీ చానల్స్ రిపోర్టర్‌లు అడిగారు.. వైసీపీ అనేది గోడవలకు పర్యయపదం అని చెప్పా.
నిన్న గొడవ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇన్నేళ్లు వాళ్లను తట్టుకొని నిలబడడం చూస్తే ఆయనకు హ్యాట్సాప్ చెప్పాలి.
నిన్న వారి గొడవ చూస్తే ఎప్పుడయితే పేపర్‌లు విసిరేసి అక్కడికి వచ్చారో వివేకానంద రెడ్డి హత్య గుర్తువచ్చింది, ప్రజావేదిక, 200 ఆలయాల కూల్చివేతలు గుర్తువచ్చాయి, డాక్టర్ సుధాకర్ చనిపోవడం, జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలు గుర్తువచ్చాయి. పత్రికాదిపతులపై దాడులు, రఘురామకృష్ణం రాజు మీద జరిగిన దాడులు, 53రోజులు చంద్రబాబును జైలులో పెట్టన విధానం గుర్తు వచ్చింది, అమరావతి రైతులును పెట్టిన హింస గుర్తువచ్చింది.
-
2025-02-25T15:30:08+05:30
పులివెందులకు జగన్.. ఎందుకు వెళ్లారంటే..
కడప: మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే వైఎస్ జగన్ పులివెందులకు వెళ్లారు.
బాక్రాపురంలోని తన నివాసం చేరుకున్నారు.
మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్భార్ నిర్వహిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మరికొంతమంది ప్రముఖులు ఉన్నారు.
సాయంత్రం 5 గంటల సమయంలో పలు ప్రైవేట్ కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
-
2025-02-25T13:42:22+05:30
కడుపు మండిపోతుంది..
శాసనసభలో బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభలో వైసీపీ సభ్యుల తీరుపై తీవ్ర అభ్యంతరం
కడుపు మండిపోతుందన్న విష్ణుకుమార్ రాజు
ఇవాళ సభకు వస్తారేమో కడుపుమంట తీర్చుకుందామనుకున్నా..
ఇవాళ సభకు రాలేదన్న విష్ణుకుమార్ రాజు
సభలో సోమవారం జరిగిన ఘటన దురదృష్టకరమన్న విష్ణుకుమార్ రాజు
జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అని తెలుగు ప్రజలు ఎదురుచూశారు
జగన్‌పట్ల కూటమి ప్రభుత్వం వైఖరి ఎలా ఉంటుందోనని తెలుగు ప్రజలు ఎదురుచూశారు
వైసీపీ నాయకులే తలదించుకునేలా జగన్ వైఖరి ఉంది
పెద్ద వయస్కులైన 89 ఏళ్ల ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పోడియం ముందుకు పంపి నిరసన తెలపమని చెప్పడం జగన్‌కు సిగ్గుగా లేదా
తన స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ ఎవరిని వదిలిపెట్టడంలేదు
-
2025-02-25T13:11:49+05:30
వైసీపీ నేతలకు లోకేష్ సవాల్
గత వైసీపీ ప్రభుత్వంలో నేతల అరాచకాలపై దర్యాప్తు జరుగుతుందన్న లోకేష్
తమ కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన ఎవరిని వదిలిపెట్టేది లేదని వార్నింగ్
శాసనమండలి వేదికగా వైసీపీకి లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్
వైసీపీ నేతల అరాచకాలపై సీబీఐ దర్యాప్తతు జరుగుతుందన్న మంత్రి లోకేష్
నా వ్యాఖ్యలను రాసిపెట్టుకోవాలన్న లోకేష్
మార్క్ మై వర్డ్స్ అంటూ గట్టిగా వైసీపీ నేతలను హెచ్చరించిన మంత్రి లోకేష్
-
2025-02-25T12:53:47+05:30
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి బీసీ సంఘం మద్దతు
కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు మద్దతు తెలిపిన ఏపీ బీసీ సంక్షేమ సంఘం
నమూనా బ్యాలెట్ ను విడుదల చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకర రావు, బీసీ సంఘం నాయకులు
ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకర రావు కామెంట్స్..
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చాం
26 జిల్లాల నుంచి బీసీ కుల సంఘాల నాయకులు వచ్చి మద్దతు ఇచ్చారు
కూటమి గెలుపులో బీసీలు కీలకపాత్ర పోషించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోరడంతో బీసీ సంఘం తరఫున ఆలపాటికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం.
గత ఐదేళ్ల వైసీపీ పాలన, ప్రస్తుత కూటమి పాలన ఎలా ఉందనేది చూడాలి
ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
బీసీల పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ సోదరులకు చట్టం ఎలా ఉందో, అలా బీసీల కోసం కఠిన చట్టం చేయాలి
ఆలపాటి రాజేంద్రప్రసాద్ కామెంట్స్
జనాభాలో సగభాగంగా బీసీలు ఉన్నారు..
తన గెలుపులో బీసీలు భాగస్వామ్యమవుతున్నందుకు ధన్యవాదాలు
బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యం
కూటమి గెలుపులొ బీసీ ల పాత్ర ఎంతో ఉంది.
నిరుద్యోగ పట్టభద్రులకు ఉద్యోగ కల్పన లక్ష్యం
వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను
-
2025-02-25T12:22:52+05:30
ఢిల్లీ శాసనసభ ముందుకు కాగ్ నివేదిక
గత ఆప్ ప్రభుత్వంపై కాగ్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టిన సీఎం రేఖాగుప్తా
కాగ్ నివేదికలో విస్తుపోయే నిజాలు
కాగ్ నివేదికపై చర్చకు అనుమతించిన స్పీకర్ విజేందర్ గుప్తా
కాగ్ నివేదికపై చర్చను ప్రారంభించిన అరవింద్ సింగ్ లవ్లీ
ఆప్ హయాంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై సీఏజీ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వం
పదేళ్లుగా ఢిల్లీ శాసనసభలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టలేదన్న అరవింద్ సింగ్ లవ్లీ
-
2025-02-25T11:20:43+05:30
ఢిల్లీ శాసనసభలో గందరగోళం
ఢిల్లీ శాసనసభలో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగం
ఎల్జీ ప్రసంగం ప్రారంభం కాగానే ఆప్ ఎమ్మెల్యేల నిరసన
ఫ్లకార్డులతో ఆప్ ఎమ్మెల్యేల నిరసన
ఎమ్మెల్యేల నిరసన మధ్య ప్రసంగం ప్రారంభించిన ఎల్జీ వీకే సక్సేనా
ఆప్ ఎమ్మెల్యేల నిరసన ఆపకపోవడంతో ఫ్లకార్డులు తీసుకోవాలని మార్షల్స్‌ను ఆదేశించిన స్పీకర్
కొందరు ఆప్ ఎమ్మెల్యేలను ఒకరోజు సస్పెండ్ చేసిన స్పీకర్
ఎల్జీ ప్రసంగానికి తరచూ అడ్డు తగిలిన ఆప్ ఎమ్మెల్యేలు
సభలో బీజేపీ ఎమ్మెల్యేల మోదీ.. మోదీ నినాదాలు
-
2025-02-25T10:52:02+05:30
ఎమ్మెల్సీ ఎన్నికలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
బీజేపీ ఇండియా టీమ్.. కాంగ్రెస్‌ది పాకిస్తాన్ టీమ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలి
రేవంత్ పర్యటన తో కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది.
తెలంగాణలో 4 కోట్ల 30 లక్షల జనాభా ఉంటే.. 3 కోట్ల 70లక్షల మందే ఎలా వస్తారు
కేసీఆర్ కేసులపై మీరు విచారణ చేస్తూ మమ్మల్ని అరెస్ట్ చేయమంటారా
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు, కేటీర్ కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు
దమ్ముంటే కేసిఆర్ కేసులను సిబిఐ ఐ కి ఇవ్వండి
ఫార్ములా ఈ రేస్ కేసులో ఈవెంట్ ఆర్గనైజర్ ను ఎందుకు చేర్చలేదు
విద్యుత్ కొనుగోళ్ళల్లో అక్రమాలు జరిగితే.. కేసిఆర్‌ను ఎందుకు విచారించలేదు
జన్వాడ ఫామ్ హౌస్ కేసు ఏమైంది
-
2025-02-25T10:43:19+05:30
అసెంబ్లీలో ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధి
శాసనసభలో జగన్ తీరు తీవ్ర అభ్యంతరకరం
ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలా పనిచేస్తుందో వివరంగా చెప్పారు
శాసనసభలో జగన్ ఓ డ్రామా చేశారు
జగన్ ప్రభుత్వంలోనూ కేంద్రం సహాయం చేసింది
కేంద్రం నిధులను జగన్ సద్వినియోగం చేసుకోలేకపోయారు
మిర్చి ధరల సమస్యను కేంద్రం రెండు రోజుల్లో పరిష్కరించింది
-
2025-02-25T10:10:18+05:30
జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి కామెంట్స్
జగన్ ఓ జోకర్
ప్రజా తీర్పును గౌరవించని వ్యక్తి జగన్
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన లోకం నాగమాధవి
ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తోంది
గ్రామాల అభివృద్ధికి పల్లె పండుగ కార్యక్రమం దోహదపడుతుంది
గిరిజన గ్రామాల్లో డోలీ కష్టాలను ఈ ప్రభుత్వం తీరుస్తోంది
-
2025-02-25T10:03:05+05:30
గవర్నర్ ప్రసంగంపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి కామెంట్స్
గవర్నర్ ప్రసంగం ప్రభుత్వం రానున్న కాలంలో ఏం చేయబోతుందో స్పష్టంచేసింది
జగన్మోహన్ రెడ్డి వైఖరి తీవ్ర అభ్యంతరకరం
11 మంది ఎమ్మెల్యేలతో వచ్చి 11 నిమిషాలు ఉండి వెళ్లారు
జగన్ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది
ప్రజలు ఎంతో విశ్వాసంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు
అన్ని రంగాలను గత వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది.
-
2025-02-25T09:36:05+05:30
శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో చర్చ
చర్చను ప్రారంభించిన ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్
జగన్ వైఖరిని తప్పుపట్టిన రవికుమార్
గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగలడం ఎంతో బాధాకరం
జగన్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయిల ధాన్యం బకాయిలు- రవికుమార్
రైతులను జగన్ ప్రభుత్వం గతంలో ఎంతో బాధపెట్టింది- రవికుమార్
ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు డబ్బులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 24 గంటల్లో చెల్లిస్తుంది- ఎమ్మెల్యే రవికుమార్
ఏపీలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఎమ్మెల్యే కూన రవికుమార్
-
2025-02-25T09:25:56+05:30
జగన్ పత్రికలో అసత్య వార్తపై స్పీకర్ విచారం
ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించకుండా కోట్లు దోచేశారంటూ జగన్ పత్రికలో వార్త బాధాకరమన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు
దీనిపై చర్యలు తీసుకోవాలని కోరిన ఎమ్మెల్యే గిత్తా జయసూర్య
జగన్ పత్రికలో అవాస్తవ వార్త ప్రచురించడంపై సభా హక్కుల కమిటీకి స్పీకర్ సిఫార్సు
సభా హక్కుల కమిటీ నివేదిక తర్వాత చర్యలు ఉంటాయన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు